fbpx

దుష్ట పాలనకు చరమగీతం పాడుతాం

Share the content

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దుష్ట పాలనకు చరమగీతం పాడుతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి వెంకట ప్రభాకర్(బాబీ)తెలిపారు. బుధవారం యువగళం పాదయాత్ర ముంగిపు సభకు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి కటకంశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో వందల కార్లతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీను బాబీ జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతో కూడిన పాలన అందివ్వటానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం చేపట్టారని తెలిపారు.రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన సాగుతుందని, ప్రజలకు నరకయాతన చూపిస్తున్నా ఈ దుష్ట వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజా పాలన అందించడమే తెలుగుదేశం, జనసేన పార్టీల లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి,సంక్షేమంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో లోకేష్ 226 రోజులు,97 నియోజకవర్గాల్లో,2100 గ్రామాలలో 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసారని పేర్కొన్నారు. పాదయాత్ర ముగింపు సభ విశాఖపట్నంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్గించిన, అవవరోదాలు పెట్టినప్పటకీ మొక్కోవోని దైర్యంతో లోకేష్ తన పాదయాత్రను పూర్తి చేసారని పేర్కొన్నారు

యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలను, సమస్యలను దగ్గర నుండి చూసారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. వైసిపి దుర్మార్గపు పాలనకు కొన్ని రోజులు మాత్రమే గడువు ఉందని ప్రజలకు లోకేష్ భరోసా కల్పించారాని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రతో వైసీపీ బ్యాచ్ కు నిద్రపట్టడంలేదని,ఈ సభతో వైసీపీ పార్టీ పాతాళంలోకి పోవటం ఖాయమని జోస్యం చెప్పారు. యువగళం ముగింపు సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ సభలో పాల్గొని కార్యకర్తలకు దిషా,నిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. లోకేష్ చేసిన పాదయాత్రకు సహకరించిన ప్రతీ ఒక్క తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే జోష్ తో రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ గద్దె దింపాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *