fbpx

స్టీల్ ప్లాంట్ ప్రవేటుపరం చేయమని జట్టు కట్టారా? : జగన్మోహన్ రెడ్డి

Share the content

విశాఖ ఉక్కును ప్రవేటుపరం చేయమని చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్ లు జట్టు కట్టారా? రాష్ట్రానికి ప్రతేక హోదా సాధిస్తామని జట్టు కట్టారా ? 2024 ఎన్నికల డ్రామాల్లో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏమిటి? అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పేదవాడి భవిష్యత్ మారాలన్నా..పథకాలు కొనసాగాలన్న రెండు బటన్లు ఫ్యాన్ మిద నొక్కాలి అని పిలుపునిచ్చారు.మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత ఎన్నికల ముందు పోలవరాన్ని తన ఎటిఎంగా మార్చుకున్నారని… పార్టీలు మార్చడం..తిట్టినా వారిని సంకన ఎత్తించుకోవడం విద్యల్లో బాబు నిపుణులని మోదీ విమర్శించారు. ఆనాడు చంద్రబాబు అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే….నేడు చంద్రబాబు కంటే గొప్పవారు రాజకీయాల్లో ఎవరు లేరని మోదీ చెప్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాలు అనేవి ఏ స్థాయికి దిగజారిపోయాయో ప్రజలు గమనించాలని కోరారు.గాజువాకలో టిడిపిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ మద్దతు తెలిపినట్లె అని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలుపుదల చేయాలంటే ఎన్డీయే కూటమి ఓడించాలని పిలుపునిచ్చారు.

విశాఖ పార్లమెంట్ , గాజువాక అసెంబ్లీ లో ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధిస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్నీ అడ్డుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ అంశాన్నే ఎన్నికల రెఫరెండంగా ఎన్డీయే కూటమి చెబుతుందని తెలిపారు. తరువాత స్టీల్ ప్లాంట్ పై తాను ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. రైల్వే జోన్ కు రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం లిటిగేషన్ పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా నిలబడకలిగిన జోన్ ను రైల్వే జోన్ అంటారని పేర్కొన్నారు.కేవలం రెండు బిల్డింగ్లు కట్టి మమా అని అనిపించడం వలన ఎవరికి ప్రయోజనం ఉండదని విమర్శించారు.రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతూ చంద్రబాబు మేనిఫెస్టో ఉందని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హమ్మిలో ఒక్కటైనా అమలు చేశారా? 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ జరిగిందా? పొదుపు సంఘాల రుణాలన్ని రద్దు చేస్తామని అన్నారు.14205 కోట్ల రూపాయలు డ్వాక్రా వారికి ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? 10,000 కోట్ల రూపాయలు తో బిసి సబ్ ప్లాన్ జరిగాయా అని ప్రశ్నించారు. రాష్ట్రం సింగపూర్ కు మించి అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *