fbpx

వైసిపి వైరస్ కు….జనసేన టిడిపి విజయమే వ్యాక్సినేషన్ : నాగబాబు

Share the content

కరోనా వైరస్ కంటే వైసిపి ప్రమాదకరం అనే స్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు.నిరంకుసత్వంతో రెచ్చిపోతున్న రెచ్చిపోతున్న వైసిపి వైరస్ కు జనసేన, తెలుగుదేశం విజయమే వ్యాక్సినేషన్ అని ఎద్దేవా చేశారు. బుధవారం పాయకరావుపేటలో జనసేన జనసేన కార్యకర్తలతో సమావేశం అయ్యి రానున్న ఎన్నికలకు దిశా,నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..వైసిపి ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి పదేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామాల్లో కనీసం మౌలిక వసతులు కల్పించకపోవడం తో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని పేర్కొన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా…జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపిద్ధామని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగు కోసం పొత్తులో ఎవరికి ఏ స్థానం దక్కిన కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

మత్స్యకారుల జీవితాలు అస్తవ్యస్తం

నేనల్ ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్ నిర్మాణానికి మత్స్యకారుల నుంచి భూమిని సేకరించిన ప్రభుత్వం..వారికి తగిన నష్ట పరిహారం తో పాటు మరో ప్రాంతంలో భూమి,స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది అని గుర్తు చేశారు. హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా..ప్రభుత్వం మాట నిల్బెట్టుకొలేక పోయింది అని మండిపడ్డారు.కనీసం ఈ ప్రాంతలో వేటకు వెళ్లకుండా ఆంక్షలు పెట్టింది అని ధ్వజమెత్తారు.హేటిరో,డెక్కన్ ఫార్మా కంపెనీలు కాలుష్యం వలన సముద్ర జలాలు కలుషితం అయ్యి మత్స్య సంపద తీవ్రంగా నష్టపోతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు.స్థానిక పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వలన భూగర్భ జలాలు కలుషితం అయ్యి పశువులు మృత్యువాత పడటంతో యాదవులు తీవ్రంగా నష్టపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి సుందరపు వెంకట సతీష్,విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు,పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి,లక్ష్మి శివ కుమారి, బిడపాటి శివదత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *