fbpx

వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల

Share the content

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల ఇంఛార్జిల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లు తెలుస్తోంది. మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లు స్పష్టమవుతోంది. తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జిల పోస్టులు దక్కాయి. ఎంపీలకూ అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు.

1) అనంతపురం ఎంపీ – శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ
2) హిందూపురం ఎంపీ – శ్రీమతి జోలదరాశి శాంత
3) అరకు ఎంపీ (ఎస్టీ) – శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి
4) రాజాం (ఎస్సీ) = డా! తాలె రాజేష్‌
5) అనకాపల్లి – శ్రీ మలసాల భరత్‌ కుమార్‌
6) పాయకరావుపేట (ఎస్సీ) – శ్రీ కంబాల జోగులు
7) రామచంద్రాపురం – శ్రీ పిల్లి సూర్యప్రకాష్‌
8) పి.గన్నవరం (ఎస్సీ) – శ్రీ విప్పర్తి వేణుగోపాల్‌
9) పిఠాపురం – శ్రీమతి వంగ గీత
10) జగ్గంపేట – శ్రీ తోట నరసింహం
11) ప్రత్తిపాడు – శ్రీ వరుపుల సుబ్బారావు.
12) రాజమండ్రి సిటీ – శ్రీ మార్గాని భరత్‌
13) రాజమండ్రి రూరల్‌ – శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
14) పోలవరం (ఎస్టీ) – శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి
15) కదిరి బి ఎన్ మక్బుల్ అహ్మద్
16) ఎర్రగొండపాలెం (ఎస్పీ) తాటిపర్తి చంద్రశేఖర్‌
17) ఎమ్మిగనూరు మాచాని వెంకటేష్‌
18) తిరుపతి భూమన అభినయ్‌ రెడ్డి
19) గుంటూరు ఈస్ట్‌ – శ్రీమతి షేక్‌ సూరి ఫాలిమా
20) మచిలీపట్నం – శ్రీ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
21 చంద్రగిరి – శ్రీ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి
22) పెనుకొండ – శ్రీమతి కె.వి. ఉషా శ్రీచరణ్‌
23) కళ్యాణదుర్గం – శ్రీ తలారి రంగయ్య
24) అరకు (ఎస్టీ) – శ్రీమతి గొడ్డేటి మాధవి
25) పాడేరు (ఎస్టీ) = శ్రీ మత్స్యరాస విశ్వేశ్వర రాజు
26) విజయవాడ సెంట్రల్‌ – శ్రీ వెలంపల్లి శ్రీనివాస రావు
27) విజయవాడ వెస్ట్‌ – శ్రీ షేక్‌ ఆసిఫ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *