fbpx

పొత్తులు పెట్టుకున్నా….కూటమి కట్టినా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టబోతున్నారు : అంబటి రాంబాబు.

Share the content

వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేపోయింది… అనే ఒక అసత్యాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. దేశంలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం వైయస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇది రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ తెలుసు అని జలవనరులు శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.అసెంబ్లీ ఆవరణలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. 2014-19 మధ్య రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు.ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు. ఇది బాబు-జగన్ మధ్య ఉన్న తేడా అని పేర్కొన్నారు. మా మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నాం. చంద్రబాబు 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఏకంగా అదృశ్యమైపోయింది. వెబ్ సైట్ లో లేదు. 2014 టీడీపీ మేనిఫెస్టో చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి చంద్రబాబుకు వచ్చింది.అందుకే మాయం చేశారు.

మేనిఫెస్టోలను మాయం చేసిన తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు.. మేనిఫెస్టోలో హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి మేనిఫెస్టోను తీసుకెళ్ళి ఇచ్చిన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు.
అందుకే మరల తిరిగి ఓటు అడగడానికి వెళ్తున్నాం, సిద్దమయ్యాం.. మా టార్గెట్ 175 కు 175 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించి తిరిగి అధికారంలోకి రావాలని టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. దానికి సంబంధించి అనేక మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న వ్యక్తి జగన్ … ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.మేనిఫెస్టోలో ప్రతి వాగ్దానాన్ని అమలుచేశాం.. సీపీఎస్ కు ఆల్ట్రనేటివ్ తీసుకొచ్చాం.మేము మేనిఫెస్టో అమలు చేయలేదని అసత్య ఆరోపణలు చేస్తున్న టీడీపీకి దమ్ముంటే 2014 మేనిఫెస్టోను తీసుకొచ్చి మాట్లాడాలి.. మా మేనిఫెస్టోని పట్టుకుని మాట్లాడే దమ్ము, ధైర్యం మాకు ఉంది.

పవన్ కళ్యాణ్….సీట్లు, నోట్ల ముష్టి కోసం వెళ్ళాడా?

చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ ఉదయం, సాయంత్రం వెళ్ళారు… ప్యాకేజీ ముష్ఠి కోసం వెళ్ళాడా? సీట్లు ముష్ఠి కోసం వెళ్లాడా? అని ప్రశ్నించారు.జనసేన నాయకులు, కార్యకర్తలకు ఒక్కటే చెబుతున్నా… కుక్క తోక పట్టుకుని గోదారి ఈదకండి. చంద్రబాబు మాట విని పవన్ కల్యాణ్ కార్యకర్తల్ని ముంచుతాడు. చంద్రబాబు మీకు ముష్ఠి వేస్తాడు, ఆ ముష్ఠి తీసుకునే పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి మీకు ఉంది. రోజు తిరగడమే పని తప్ప ఫలితం ఉండదు. చంద్రబాబు 20-25 సీట్లు ఇవ్వడమే గగనం. ఇది అందరికి తెలిసిన సత్యం. జనసేన కార్యకర్తలు ఆలోచించుకోవాలి… మీరు మోసపోతున్నారు అని తెలిపారు.

టీడీపీ-జనసేన ఏదేదో మాట్లాడతారు. అసలు వారు ఇంతవరకు సిద్దమే కాలేదు,ఇంకా భేటీలలోనే ఉన్నారు. మేము సిద్దం అయ్యాము, దూసుకుపోతున్నాం. వాళ్లు సీట్లు, నోట్లు లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు. కనపడినవాళ్ళందరినీ.. రా కదలిరా అంటున్నారు కానీ, ఎవరు కదిలొచ్చే పరిస్థితి లేదు.. అందుకే జాయింట్ గా మీటింగ్ లు పెడతారంటా.. సినిమా యాక్టర్ ను చూడడానికి వచ్చిన వాళ్ళందరికి చంద్రబాబు ఉపన్యాసం చెబుతారంటా. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు తీసుకువెళ్ళినట్టు… పవన్ కల్యాణ్ ను తీసుకెళ్ళి జనాల్ని పోగేసేకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

లోకేష్ బయటకు వస్తే టీడీపీ ఔట్ః

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు, దాచేసినట్టున్నారు. ఆయన్ను బయటకు పంపిస్తే టీడీపీ ఔట్ అని చెప్పినట్టున్నారు. లోకేష్ ను దాచేసినా, బయట పెట్టినా టీడీపీ ఔటే.. ఇది వాస్తవం.. పాదయాత్ర చేసిన వీరుడు, సూరుడు అని చెప్పిన లోకేష్ ను తీసుకెళ్ళి పక్కనపెట్టారని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *