fbpx

షర్మిల కొంగును ఓట్లతో నింపండి : వైయస్ సౌభాగ్యమ్మ

Share the content

తెలుగు సంప్రదాయం ప్రకారం ఆడ బిడ్డలు పుట్టింటికి వచ్చినప్పుడు చీర,సారే పెట్టీ పంపిస్తారు. కడప జిల్లా పుట్టింటి బిడ్డ షర్మిల చీర, సారె అడగటం లేదు. కడప పార్లమెంట్ ఎన్నికల్లో న్యాయం చేయాలని కొంగుచాచి కోరుతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో కడప పార్లమెంట్ ఓటర్లు తమ ఓట్లతో షర్మిల కొంగును నింపాలని అని వైయస్ వివేకానంద రెడ్డి సతీమణి వైయస్ సౌభాగ్యమ్మ పిలుపునిచ్చారు. గురువారం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ యాత్ర బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.గతంలో షర్మిలను ఎంపిగా చూడాలని వివేకానంద రెడ్డి అనుకున్నారు. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. షర్మిల పార్లమెంట్లో సమస్యలు గళం వినిపిస్తుంది.సమస్యలు ను పరిష్కరించేందుకు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న షర్మిలను ఆశీర్వదించాలని కోరారు. రాజశేఖర్ రెడ్డి పరిపాలన షర్మిలమ్మ తోనే సాధ్యం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *