fbpx

నియంత పాలకులను తరిమికొట్టండి : వైయస్ షర్మిల

Share the content

దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళను సైతం తరిమికొట్టిన పౌరుషం అల్లూరి సీతారామరాజుది.ఆయనే మీకు..మాకు స్పూర్తి.. ఆ రక్తం…అదే పౌరుషం మీలో ఉంది..అప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎలా ఐతే తరిమి తరిమి కొట్టారో….నేడు..నియంత పాలకులను కూడా అలానే తరిమి తరిమి కొట్టాలి. ప్రజల పక్షాన నిలబడని పాలకపక్షం వద్దు .. ప్రజల పక్షాన నిలబడని ప్రతిపక్షం కూడా వద్దు..ప్రజల పక్షాన నిలబడే కాంగ్రెస్ పార్టీని ఎంచుకోండి…అని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు బహిరంగ సభకు హాజరైన ఆదివాసీలను ఉద్దేశించి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం..ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభయ హస్తం అని తెలిపారు.

ఆదివాసీలకు భూహక్కులు కల్పించిన రాజశేఖర్ రెడ్డి.

అట్టడుగున ఉన్న వారికి ఎంతో చేయాలని రాజశేఖర్ రెడ్డికి ఉండేది.అందుకోసం ఈ ప్రాంతంలో పాఠశాలలు, 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీలు కట్టించారు.ఆదివాసీలకు 20 లక్షల ఎకరాల భూమి మీద హక్కు కల్పించడంమే కాకుండా ఆ భూమి మీద పాస్ బుక్ పట్టాలు ఇచ్చి..లోన్లు వచ్చేటట్టు చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి కే దక్కుతుంది అని తెలిపారు. ఎస్సీ ,ఎస్టీ సబ్ ప్లాన్ కేటాయించిన ప్రతి పైశాను వారి కోసమే ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. నేడు ఆదివాసీల సమస్యలు ముఖ్యమంత్రి కి పట్టడం లేదు కానీ బాక్సైట్ తవ్వకాల కోసం పెద్ద పెద్ద రోడ్లు వేసుకుంటున్నారు. బాక్సైట్ మైనింగ్ మీద ఉన్న ఆసక్తి… ప్రజల అభివృద్ధి మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పులులు.. సింహాలు బీజీపీ మీద ఎందుకు గాండ్రించడం లేదు ?

చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు, వాళ్ళకి వంగి వంగి దందాలు పెట్టుకోచ్చారు.. జగన్ అన్న వెళ్లి ఒక పేపర్ ముక్క పెట్టీ వచ్చారు. పేపర్ ముక్కతో ఏమౌతుంది. మీరు కొట్లాడే వాళ్ళు ఐతే …ఒక్కసారి ఐన నిలదియలేదే అని ప్రశ్నించారు. మీ అభిమానాలు మిమ్మల్ని ..పులి..సింహం అంటున్నారు…బిజెపి మీద ఎందుకు గాండ్రించడం లేదు. బీజీపీ మీద ఎందుకు పంజా విప్పడం లేదు.మీ ప్రతాపం అంతా మీ ఆడ బిడ్డల మీదేనా? మీ ప్రతాపం సోషల్ మీడియా మీదనే.? మీ ప్రతాపం ఏమీ లేదని తేలిపోయింది….ఒక్క సారి అంటే ఒక్క సారి నిజమైన ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు.

మెగా డిఎస్సీ… దగా డిఎస్సీ అయ్యింది.

       గత ప్రభుత్వంలో చంద్రబాబు  డిఎస్సీకి 7,000  పోస్టులును ప్రకటిస్తే...ప్రతిపక్ష నేతగా ఉన్న జగనన్న 25,000 ఖాళీలు ఉంటే ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. నేను ముఖ్యమంత్రి ఐతే 25,000 పోస్టులను భర్తీ చేస్తాను అని అన్నారు..మరి ముఖ్యమంత్రి అయ్యారు కదా...నేడు ఏమైంది జగనన్న కేవలం 6000 పోస్టులనే ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు.

రాజధాని అంశంలో తలెత్తుకోలేకుండా చేశారు.

రాష్ట్రం ఏర్పడిన ఈ పదేళ్ళలో ఏమైనా అభివృద్ధి చెందామా? ఇక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందని మండిపడ్డారు.చంద్రబాబు ఏమో అమరావతి రాజధాని అన్నారు.సింగపూర్ చేస్తాను అని అన్నారు. ఇప్పుడు జగనన్న మూడు రాజధానులు కావాలి అన్నారు..ఇది మా రాజధాని అని తలెత్తుకొని చెప్పలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు.ఒకప్పుడు లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను..అన్ని విభాగాలను కాళ్లు చేతులను కోట్టేసి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు అని ధ్వజమెత్తారు.

జగన్ అన్న వాగ్ధానాలు… వైన్ షాప్ లో ఉన్నాయి.

పూర్తి మధ్య పాన నిషేధం చేశాక వచ్చి ఓట్లు అడుగుతాను అని జగన్ అన్న అన్నారు…..ఇదే విషయాన్ని మేనిఫెస్టో లో పెట్టాను అని అన్నారు….మధ్యపాన నిషేధం అవ్వకపోగ..ప్రభుత్వమే మద్యం అమ్ముతింది. ప్రభుత్వ ఎది అమ్మితే అదే కొనాలి..బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్ …కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన.. అన్ని మద్యం షొప్ లో దోరుకుతున్నాయని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం డేగ కన్ను వేసి కాపలా ఉండకుండా.. వాళ్ళతో కుమ్మక్కు ఐతే ప్రజలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా తెస్తామని..జీవో 3 పై న్యాయ స్థానంలో పోరాడతామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *