fbpx

అమ్మకు అన్ని తెలుసు… దమ్ముంటే అమ్మ చేత చెప్పించండి : వైయస్ షర్మిల

Share the content

నాకు నేనుగా నిస్వార్థంగా జగన్ అన్న కోసం పాదయాత్ర చేసా..నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా.. ముఖ్యమంత్రి అయిన తరువాత నాకు ఈ పని కావాలని, ఈ పదవి కావాలని గానీ నేను ఏ రోజు కొరిన వ్యక్తిని కాదు. ఈ విషయాలన్ని అమ్మకు తెలుసు…మీకు దమ్ము ఉంటే అమ్మ చేత చెప్పించండని సవాల్ విసురుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ షర్మిల వైసిపి నేతలు మీద మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…అన్ని వర్గాల వారి కోసం అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందించారు. కానీ కొందరు నియంతలుగా మారి రాజ్యాంగ స్ఫూర్తిని కాల రాస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన అవసరం రాష్ట్ర ప్రజల మీద ఉంది. అన్ని వర్గాలకు, మతాలకు, రాష్ట్రాలకు అందరికీ మేలు చేయాలని ఉద్దేశంతో అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. భారత దేశంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో వచ్చిన తరువాత నియంత ల వలే కొన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నరని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని గౌరవించటం అంటే…ఒక జెండా ఎగురవేటం తో అయిపోయే పని కాదు….అన్ని కులాలను,మతాలను బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి..ఇటీవల కాలంలో నియంతల వలే మారిన ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాలు దీన్ని అమలులో పెట్టడం లేదని స్పష్టం గా కనిపిస్తుంది.

ప్రశ్నిస్తే డోర్ డెలివరీ చేస్తున్నారు.
అంబేద్కర్ దళితుల కోసం ఎంతోగానో పోరాటం చేశారు. ఈరోజు అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగటం లేదు…ప్రభుత్వాలు పెద్ద పెద్ద విగ్రహాలు కడుతూ.. సోషల్ జస్టిస్అం టున్నారు..కానీ నిజానికి రాష్ట్రంలో సోషల్ జస్టిస్ అనేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా దళితుల మీద జరుగుతున్న దాడులు 100 శాతం పెరిగాయని వాపోయారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..రాష్ట్రంలో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే…ప్రశ్నించే వారిని శవాలనుగా చేసి డోర్ డెలివర్ చేస్తున్నారు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం.. జైల్లో పెట్టడం,స్టేషన్ లో గుండు కొట్టించి అవమానిస్తున్నారు. కనీసం దళితులకు చెందవలసిన ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కూడా పక్కదారి మళ్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర ప్రజలు జాతీయ జెండా సాక్షిగా ప్రమాణం చేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ తరుపున ఈ 75వ గణతంత్ర దినోత్సవం రోజున.. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ కొరకు పోరాటం చేయని పార్టీలకు…తమ స్వలాభం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీలకు మద్దతు తెలపమని జాతీయ జెండా సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రమాణం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *