fbpx

వైసీపీ తీరు వాళ్ళకే నష్టం

Share the content

తమకు జై అంటే ఓకే.. లేకుంటే ఎవరైనా ఒక్కటే అంటూ వైసీపీ సాగిస్తున్న ఎదురుదాడి రాజకీయంగా ఆ పార్టీకి పెద్ద నష్టమే చేసేలా కనిపిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పై వైసీపీ నాయకులు వరుసగా చేస్తున్న మాటల దాడి ఇప్పుడు ఆ పార్టీని డిఫెన్స్ లో పడేస్తోంది. ప్రభుత్వం అంటే ప్రజలకు అవసరమైన విషయాలు గురించి మాట్లాడాలి అని తన అనుభవంతో అన్న చిరంజీవి వ్యాఖ్యలలో ఏమాత్రం తప్పులేదు. ప్రజారాజ్యం అనే పార్టీని నడిపి కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ లో విలీనం చేసి సినిమాలు చేసుకుంటున్న చిరంజీవి ప్రభుత్వానికి సలహా ఇవ్వడంలో తప్పులేదు. దానిని వైసీపీ ప్రభుత్వం హుందాగా తీసుకుంటే బాగుండేది. అలాకాకుండా వైసిపి మంత్రులు వరుసుగా ప్రెస్ మీట్ లు పెట్టి చిరంజీవి ఏమనకుండానే ఏదో అన్నట్లుగా మాట్లాడడం వైసీపీ నైజాన్ని బయటపెడుతోంది. చిరంజీవి ఇప్పటివరకు రాజకీయాల్లో కి రాకపోయి ఉంటే పర్వాలేదు. ఒక రాజకీయ పార్టీ పెట్టి 18% పైగా ఓట్లు తెచ్చుకున్న చిరంజీవికి కచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడే హక్కు ఉంది. వైసీపీ నాయకులు దీనిని గుర్తించకుండా, చిరంజీవిని ఇష్టానుసారం తిట్టడం ద్వారా ఆయన అభిమానుల్లోనే కాక తటస్థ ఓటర్లు నుంచి కూడా విమర్శలు మూట కట్టుకోక తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కచ్చితంగా వైసీపీకి బ్రహ్మరథం పడితేనే ఉండాలి. లేకపోతే లేదు అనేలా వైసిపి నేతలు ప్రవర్తిస్తున్న తీరు ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశం కనిపిస్తోంది. వైసీపీకి వ్యతిరేకంగా ఎవరు ఏ మాట మాట్లాడినా దానిని భూతద్దంలో చూసి, వెంటనే భుజాలు తడుముకోవడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. ఈ పద్ధతి వల్ల సామాన్య ప్రజల్లో పార్టీ పరిస్థితి ఏమవుతుంది అన్న స్పృహ ఉండడం లేదు.

కావాలనే హైప్ తెచ్చారు

వైసీపీ మంత్రులపై ఇప్పటికే ప్రజల్లో చెడు అభిప్రాయం ఉంది. శాఖలకు సంబంధించిన విషయాల తప్ప అన్ని విషయాలు మాట్లాడతారు అనే విమర్శలు ఉన్నాయి. అయినా వాటిని ఏమీ పట్టించుకోకుండా మంత్రులు ఇప్పుడు చిరంజీవి మీద వరుస దాడులకు పాల్పడుతున్నారని సామాన్యులు అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇది జనసేన పార్టీకి మైలేజ్ కి సంబంధించిన ఇష్యూ గా మారుతోంది. మంత్రుల వ్యాఖ్యలు తమ పార్టీకి మైలేజ్ తేవాల్సింది పోయి పక్క పార్ట్టీకి మేలు చెసేలా కనిపిస్తున్నాయి. వారాహి యాత్ర మూడో దశ మొదలవుతున్న సందర్భంగా మొదలైన చిరంజీవి రచ్చ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఈ విషయంలో ఏం వస్తుందోనన్న ఉత్కంట పెంచుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *