fbpx

బూత్ ఏజెంట్లు లేకుండా చేయడమే లక్ష్యం

Share the content

పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని వైసీపీ అరాచకం చేయాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోలీసు వ్యవస్థను పూర్తిగా తన చెప్పు చేతుల్లోకి తీసుకొని తన చెప్పినట్లు ఆడాలని ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో బూతు ఏజెంట్లు చాలా కీలకం కానున్నారు. బూత్ స్థాయిలో కూర్చొని దొంగ ఓట్లను అలాగే అధికార పార్టీ అరాచకాలను ప్రశ్నించే కీలకమైన కార్యకర్తలను కేసులు పెట్టి వేధించాలని వైసిపి ఇప్పటికే ప్రణాళికను రచించింది.

** గ్రామాల వారీగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో కీలకమైన కార్యకర్తలను ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం గుర్తించింది. వారిపై ఎప్పటికప్పుడు అక్రమ కేసులను బనయించడం ద్వారా వారిని కచ్చితంగా ఎన్నికలకు బూత్ ఏజెంట్లుగా నియమించకుండా అడ్డు తగలడానికి దీనిని ఒక మంత్ర దండంగా ఉపయోగించుకోవాలని వైసిపి భావిస్తోంది. వివిధ గ్రామాల్లో జరిగే గొడవల్లో కచ్చితంగా పార్టీలో కీలకంగా ఉండే నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయాలని, సంఘటన జరిగినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నా లేకున్నా కూడా ఎఫ్ఐఆర్ లో అదర్స్ అని రాపించి ఇష్టానుసారం అరెస్టులు ఇప్పటికే చేస్తున్నారు. ఒకవేళ పేరు తెలియకపోయినా అదర్స్ అనే కాలంను ఏర్పాటు చేసి దానిలో నిందితుడిగా చేరుస్తున్నారు. తద్వారా కోర్టు కేసుల్లో ఉన్నవారు పోలింగ్ బూత్ ఏజెంట్లుగా కూర్చోవడానికి వీలు లేదు అనే అభ్యంతరాన్ని ఎన్నికల సంఘం ముందు పెట్టాలని వైసీపీ ప్రయత్నం. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో బూతు ఏజెంట్లు గట్టి వాళ్లు లేకుండా చేసి పూర్తిస్థాయిలో ఎన్నికలను తమ చెప్పు చేతల్లోకి తీసుకోవాలని వైసిపి భావిస్తోంది. దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే ప్రణాళికను రచించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అలాగే వైసిపి నాయకులు ఇచ్చే హిట్ లిస్ట్ ఆధారంగా ఆయ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఎవరూ లేకుండా రాకుండా చేయాలని కుట్రను వచ్చే ఎన్నికల్లో వైసిపి అమలు చేయనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేజారకూడదు అనే కోణంలో ఇప్పటికే దాన్ని అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసిన జగన్ చంద్రబాబును ఎన్నికల వరకు జైలులోనే ఉంచి ఎన్నికల వ్యూహాలను కూడా బయటకు రాకుండా చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసిపి చేయరని తప్పులను ఒక్కొక్కటిగా చేసి కచ్చితంగా ఈసారి అధికారం నిలబెట్టుకోవాలని బలంగా భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *