fbpx

పురందరేశ్వరి గేమ్ ప్లాన్ లో వైసీపీ బలి

Share the content

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్ముతున్న మద్యం కల్తీదని చెబితే విజయ్ సాయి రెడ్డికి ఎందుకు కడుపు మండుతుంది?? మద్యం తయారీలో అవినీతి విపరీతంగా జరిగింది అని పురందరేశ్వరి ఆరోపిస్తే విజయ్ సాయి రెడ్డికి అక్కసు ఎందుకు?? మద్యం తయారీ మీద పురందరేశ్వరి మాట్లాడితే ఆమె వ్యక్తిగత విషయాలను విజయసాయిరెడ్డి ఎందుకు బయటకు లాగుతున్నారు?? పురందరేశ్వరి చెబుతున్నది ఏమిటి విజయ సాయి రెడ్డి మాట్లాడుతున్నది ఏమిటి?? మద్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద సిబిఐ విచారణ జరిగితే మొదటి ముద్దాయిగా తేలేది విజయ్ సాయి రెడ్డి. అందుకే ఆయనకు మద్యం మీద పురందరేశ్వరి చేస్తున్న ఘాటైన ఆరోపణలకు విజయ్ సాయి రెడ్డికి ఎక్కడో మండుతోంది. అవినీతి మీద పురందరేశ్వరి ప్రశ్నిస్తుంటే విజయసాయిరెడ్డి ఆమె వ్యక్తిగత విషయాలు బయటకు తీస్తానంటూ బెదిరిస్తున్నారు. ఓ మహిళ మీద ఎలా మాట్లాడాలో అర్థంపర్థం లేకుండా విజయసాయిరెడ్డి మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం తయారీ విషయంలో జరుగుతున్న అసలైన బాగోతాన్ని బయటపెడుతోంది. విజయ్ సాయి రెడ్డి చూపిస్తున్న అసహనం కచ్చితంగా మద్యం విషయంలో భారీ కుంభకోణం జరిగింది అని చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఉంది.

** పురందరేశ్వరి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు అయిన దగ్గర నుంచి వైసీపీ మీద నేరుగా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా మద్యం తయారీ విషయంలో అమ్మకాల విషయంలో విపరీతమైన అవినీతి జరుగుతోంది అని ఆమె క్షేత్రస్థాయికి వెళ్లి మరి పరిశీలన చేసి పక్క ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా అదానీ డిస్టలరీ కి 70 యాతం మద్యం ఆర్డర్లు ఇస్తున్నారని ఈ కంపెనీ పక్కాగా వైసిపి కి చెందిన కీలక వ్యక్తిదని విజయ్ సాయి రెడ్డి అల్లుడు దీనిలో డైరెక్టర్ గా ఉన్నారని ఆమె నేరుగా విమర్శలు చేయడంతో పాటు పక్క ఆధారాలను విలేకరులకు చూపించారు. అంతేకాదు ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో కచ్చితంగా విచారణ చేయించాలని ఆమె కోరారు. దీంతోపాటు ఆమె వద్ద ఉన్న ఆధారాలను సైతం కేంద్రమంత్రి కి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం తయారీలో విపరీతమైన కుంభకోణం జరగడంతో పాటు విషపూరిత రసాయనాలు కలగలుస్తున్నాయని దీంతో ప్రజల ఆరోగ్యాలు పూర్తిస్థాయిలో పాడైపోతున్నాయని ఆమె కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. సిబిఐ విచారణ జరిపితే దీనిలో అసలు విషయాలు బయటకు వస్తాయని ఆమే చెప్పడం.. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఆమె వైసిపి కీలక నాయకుల మీద ఆరోపణలు చేయడంతో ఇప్పుడు విజయసాయిరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. మద్యం తయారీ విషయంలో ఎలాంటి కుంభకోణం జరగడం లేదని చెప్పాల్సింది పోయి పురందరేశ్వరి క్యారెక్టర్ మీద… ఆమె వ్యక్తిగత విషయాలను బయటపెడతామంటూ విజయ్ సాయి రెడ్డి బెదిరించడం ద్వారా ఖచ్చితంగా మద్యం విషయంలో కుంభకోణం జరిగింది అని వైసిపి ఒప్పుకున్నట్లు అవుతోంది. విజయ సాయి రెడ్డి మరి కాస్త టంగ్ స్లిప్ అయితే కచ్చితంగా అది వైసిపి దెబ్బకు దారితీస్తుంది. దీంతో వైసీపీని మరింత రెచ్చగొట్టేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి కొత్త ఆరోపణలను సిద్ధం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా విజయ్ సాయి రెడ్డిని మరింత రెచ్చగొడితే… వైసీపీకి నష్టం చేకూర్చవచ్చని పురందరేశ్వరి భావిస్తోంది. దీనికి తగినట్లుగానే విజయసాయిరెడ్డి కూడా మద్యం విషయంలో ఆరోపణలకు బలం చేకూర్చేలా పురంధరేశ్వరి మీద వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ఇటు పార్టీకి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *