fbpx

ఆ ఎంపీ పార్టీ మారినట్లే!

Share the content

నరసరావుపేట ఎంపీ, విజ్ఞాన్ సంస్థల అధినేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఒకేసారి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడం చర్చనీయంశమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కృష్ణదేవరాయలకు ఇప్పటికే టికెట్ కేటాయించేది లేదని వైసీపీ అధిష్టానం చెప్పడంతో ఆయన క్రమక్రమంగా పార్టీకి దూరంగా జరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానం నుంచి టిడిపి తరఫున స్థానం ఖాళీ అవుతుండడంతో ఆ స్థానం నుంచి శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమర్ రాజా బ్యాటరీస్ ఎండి గల్లా జయదేవ్ టిడిపి నుంచి ఎక్కడ రెండు సార్లు వరుసగా గెలిచారు. జగన్ గాలిలోనూ ఏమాత్రం రాజకీయ అనుభవం లేని గల్లా జయదేవ్ ఎంపీగా గెలవడం అప్పట్లోనే సంచలనం అయింది. అయితే వ్యాపార కార్యకలాపాల రీత్యా రాజకీయాలకు దూరంగా ఉన్న గల్లా వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని లేకుంటే సైలెంట్ గా ఉండిపోతారని తెలుస్తోంది. వచ్చి ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి తనకు ఎంపీ అభ్యర్థిత్వం వద్దని ఇప్పటికే టిడిపి అధినాయకత్వానికి గల్లా జయదేవ్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో గుంటూరు ఎంపీ అభ్యర్థితో ఖాళీగా ఉండడంతో ఇప్పుడు నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు వచ్చి ఎన్నికల్లో టిడిపి తరఫున ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

లోకేష్ సై అంటే

చైతన్య విద్యాసంస్థల బి వి రావు అంత్యక్రియలో పాల్గొనడానికి వచ్చిన లోకేష్ ను శ్రీకృష్ణదేవరాయలు కలిసి కార్యక్రమంలో చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ మారడానికి శ్రీకృష్ణదేవరాయలు సిద్ధంగా ఉన్నారని లోకేష్ కనుక పచ్చ జెండా ఊపితే టిడిపిలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఎంపీ సీటు విషయంలో పూర్తి స్పష్టత వస్తే వెంటనే పార్టీ మారడానికి శ్రీకృష్ణదేవరాయలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండే శ్రీకృష్ణదేవరాయలు తన పరిధిలోని నియోజకవర్గాల్లో ఆర్థికంగా కూడా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులకు ఉపయోగపడతారు. వైసిపి నుంచి ఇప్పటికే ప్రతికూల పవనాలు వీస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ మారడం కచ్చితం అని శ్రీకృష్ణదేవరాయలు వర్గం చెబుతుంది. ఇప్పటికే టిడిపి అధినేతతో మాట్లాడిన, నిర్ణయం మాత్రం లోకేష్ కు వదిలేయడంతో ఇప్పుడు లోకేష్ చేతుల్లోనే శ్రీకృష్ణదేవరాయలు భవిత ఆధారపడి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *