fbpx

వైసిపి సోషల్ మీడియాకు కీలక సమయం!

Share the content

జగన్ తీసుకునే ఏ నిర్ణయము ఏ మాట కూడా వైసీపీకి ఏ మాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేలా అనిపించడం లేదు. ఏమాత్రం కాస్త సందు దొరికితే పెద్ద హడావుడి చేయాలని భావిస్తున్న వైసిపి సోషల్ మీడియా విభాగానికి ఇప్పుడు జగన్ తీరు, ఆయన మాటలను కవర్ చేసుకునే దుస్థితి వచ్చింది తప్ప ఇతర ప్రయోజనం ప్రచారం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. అయితే ఎన్నికల ముందు కచ్చితంగా వైయస్ జగన్ నోటి నుంచి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు వస్తాయని ఎన్నికల ప్రచారానికి అవి ఎంతో పనికి వస్తాయని భావిస్తున్నారు. ఇంకా ఎన్నికలకు సుమారు ఆరు నెలల కీలక సమయం ఉండడంతో ఇప్పుడే కీలకమైన మాటలు అన్ని మాట్లాడితే బూస్ట్రా రాదు అనే కోణంలోనే సాధారణ ప్రసంగాలతోనే జగన్ సరిపెడుతున్నట్లు సమాచారం. ఇవి విపక్షాలకు బాగానే పనికి వస్తున్నా, ఎన్నికల ముందు మాత్రం కీలకమైన తెలుగుదేశం పార్టీ జనసేన లను దెబ్బతీసేందుకు అన్ని రకాలుగా వైసీపీ సోషల్ మీడియా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఏదైనా రివర్స్

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన తీసుకున్న ఎన్నో కీలకమైన నిర్ణయాలు రివర్స్ వచ్చి వైసీపీని తాకాయి. మూడు రాజధానులు అంశం కానీ, సిపిఎస్ రద్దు గాని, ఇతర అంశాలపై జగన్ ఇచ్చిన హామీలు మాటలు నీటి మూటలు అయ్యాయి. అలాగే జగన్ చేస్తున్న ప్రసంగాలు సైతం వైసీపీ సోషల్ మీడియాకు కవర్ చేసుకోవడానికి టైం సరిపోతోంది తప్ప వాటిని ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ మాటలు విపక్షాలకు అస్త్రాలుగా అవుతున్నాయి. దీంతో ఎన్నికల ముందు అయినా జగన్ చేత కీలకమైన వ్యాఖ్యలు చేయించి విపక్షాలను ఇరుకున పెట్టాలని వైసీపీ సోషల్ మీడియా వింగ్ భావిస్తోంది. ఇప్పటికీ

పథకాల విషయంలో సభలు పెట్టి మరి జగన్ మాట్లాడుతున్న మాటలు ట్రోల్ అవుతున్న సమయంలో కచ్చితంగా ఎన్నికల సమయంలో మాత్రం ఆయనకు పూర్తి శిక్షణ ఇచ్చి ఏ అంశం మీద మాట్లాడాలి అన్న విషయం మీద ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఆయనతో ఎన్నికల సభల్లో మాట్లాడించాలని వైసీపీ సోషల్ మీడియా భావిస్తోంది. దీంతోపాటు విపక్షాల నాయకులైన చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సైతం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వాటిని ఖండించే స్ట్రాటజీ అనుసరించాలని వైసీపీ సోషల్ మీడియా విభాగం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *