fbpx

సీఎం చేతులు కలిపినా నగరి మంటలు తగ్గలేదు

Share the content

గతంలో గన్నవరంలో కనిపించిన సీన్ సోమవారం నగిరి లోను కనిపించింది. మంత్రి రోజాకు అసమ్మతి సెగగా నియోజకవర్గం లో ఉన్న నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే శాంతిని, మంత్రి రోజాను చేతులు కలిపేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నించిన ఇద్దరు మహిళ నేతలు కలుసుకోవడానికి కూడా ఇష్టత చూపించలేదు. అచ్చం గతంలో వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావు లను సీఎం జగన్ దగ్గరుండి చేతులు కలిపించిన వారు కూడా అప్పట్లో అయిష్టంగానే చేతులు కలిపి మాట్లాడుకున్నారు. ఇప్పుడు అచ్చంగా గన్నవరం సీన్ నగిరి లో జరగడం చూస్తే నగిరిలో ఉన్న అసమతి సెగలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్ధం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే రోజాకు టికెట్ ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతున్న తరుణంలో ముఖ్య మంత్రి పర్యటనలో కచ్చితంగా ఒక స్పష్టత వస్తుందని భావించారు. అయితే దీనికి భిన్నంగా నియోజకవర్గంలో వేరే వర్గంగా ఉన్న కేజే శాంతిని ముఖ్యమంత్రి దగ్గరకు పిలిపించుకొని మరి మంత్రి రోజాకు చెయ్యి ఇమ్మని చెప్పిన ఆమె అయిష్టంగానే మంత్రిని పలకరించడం విశేషం. దీంతో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఇక్కడ రోజాకు అసమ్మతి సెగ తప్పదు అన్న సంకేతాలు వచ్చాయి. మరోవైపు కేజే శాంతి వర్గం కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంగా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొదటినుంచి నగిరి నియోజకవర్గంలో మూడు గ్రూపులు ఉన్నాయి. ఒకటి రోజా గ్రూప్ అయితే రెండు పెద్దిరెడ్డి కనుసన్నల్లో నడిచే వర్గాలు. ముఖ్యంగా నగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే శాంతి భర్త కేజే కుమార్ మంత్రి పెద్దిరెడ్డి కి మొదటి నుంచి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. దీంతోపాటు కీలకమైన మరో నేత శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి కూడా నగిరి నియోజకవర్గం లో ప్రత్యేక గ్రూపును నిర్వహిస్తున్నారు. శ్రీశైలం బోర్డు చైర్మన్ గా చక్రపాణి రెడ్డికి పదవి రావడం వెనుక కూడా మంత్రి పెద్దిరెడ్డి ప్రమేయం ఉంది అన్నది బహిరంగ రహస్యం. వీరిద్దరిని మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న వ్యక్తి మంత్రి పెద్దిరెడ్డి. నియోజకవర్గంలో రకరకాల గ్రూపులను తయారు చేసి రోజాకు వ్యతిరేకంగా రాజకీయం నడుపుతున్న మంత్రి పెద్దిరెడ్డిని కాదని వైయస్ జగన్ రోజా ను మంత్రివర్గంలోకి తీసుకోవడమే పెద్ద ఆశ్చర్యం కలిగించిన విషయం. అలాంటిది ఇప్పుడు ఏకంగా రోజాను కాదని టికెట్ కోసం కేజే శాంతి బలంగా ప్రయత్నిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి బలంగా ఆమె వైసీపీ పెద్దల దగ్గర టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేజే వర్గానికి చక్రపాణి రెడ్డి వర్గం పూర్తిగా సహకరిస్తుంది. అయితే రోజాకు మాత్రం ఈ ఇద్దరి నుంచి పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా గిరి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో రోజాకు పూర్తిగా వ్యతిరేకవర్గాలను తయారు చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఈ వర్గాలు రోజాకు టికెట్ ఇస్తే కనుక వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రోజా రెండుసార్లు నెగ్గిన సమయంలో మెజారిటీ బాగా తక్కువగా వచ్చింది. చావుతప్పి కన్నులు లొట్ట పోయిన చందంగా రోజా గెలిచారు. దీంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో శాంతికి కాకుండా రోజాకు మూడోసారి కూడా టికెట్ కేటాయిస్తే కచ్చితంగా ఆమెను అన్ని విధాలుగా ఓడించేందుకు మంత్రి పెద్దిరెడ్డి వర్గం బలంగా పనిచేస్తుంది. ఒకవేళ శాంతికి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా రోజాకు సంబంధించిన వారు ఆమెకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. దీంతో ఎటు వెళ్లి ఎటు వచ్చిన వైసీపీకి నగిరి లో పెద్ద గండమే ఉంది. మొదటినుంచి నగిరి రాజకీయాల పట్ల దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి అక్కడ పరిస్థితిని ప్రతిసారి చక్కదిద్దాలని ప్రయత్నించిన ఆయనకు కూడా సాధ్యం కావడం లేదు. మంత్రి పెద్దిరెడ్డిని కాదని పూర్తిస్థాయిలో రోజాకు బాధ్యతలు అప్పగించడానికి జగన్ కు ధైర్యం సరిపోవడం లేదు. మరోపక్క రోజా పలుమార్లు అధిష్టానానికి తన పార్టీలోనే వ్యతిరేక వర్గాల పట్ల ఫిర్యాదు చేసిన ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. గతంలో మంత్రి రోజా కలగా ఉన్న మంత్రి పదవిని సైతం జగన్ ఇచ్చి వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చినా రాకున్నా పనిచేయాలని అప్పట్లోనే చెప్పారు. ఈ షరతు మీదనే అప్పట్లో మంత్రి పదవి ఇచ్చినట్లు పలువురు వైసిపి నేతలు చెప్పుకొచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో శాంతికి టికెట్ ఖరారు చేస్తారా లేదా అన్నది మాత్రం జగన్ ఇప్పటికీ బయట పెట్టడం లేదు. అలాగే రోజాకు కూడా టికెట్ కన్ఫర్మ్ చేస్తారా లేదా అనేది కూడా చెప్పడం లేదు. దీని ద్వారా జగన్ నగిరి నియోజకవర్గం రాజకీయాన్ని హోల్డ్ లో పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *