fbpx

రఘు రామకృష్ణమ రాజుకు వైసీపీ చెక్.

Share the content

అధికార వైసిపి పార్టీకి ఏకుకు మేకై కూర్చున్న భీమవరం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చెక్ పెట్టేందుకు వైసిపి పార్టీ పాములు కదుపుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి రఘురామకృష్ణ రాజుకు సీటు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం అయిపోతుంది. భీమవరం నుండి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు వైసిపి కసరత్తులు ప్రారంభించింది. దివంగత సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణమరాజు భార్య శ్యామలాదేవిని భీమవరం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు కసరత్తులు ప్రారంభించింది వైసిపి. ఇప్పటికే శ్యామలాదేవితో పలువురు వైసిపి నేతలు ఈ విషయంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు..

శ్యామల దేవి భర్త రెబల్ స్టార్ కృష్ణమరాజు 1998 -99లో బిజెపి తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అటల్ బిహారీ వాజ్పాయ్ నేతృత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యామిలీకి రాజకీయ అనుభవం ఉండటం మరోపక్క సినీ నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండటంతో పాటు భీమవరంలో క్షత్రియ సామాజిక వర్గ ఓటు బ్యాంకు ఎక్కువ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నికల బరిలోకి దింపితేగెలుపు సధ్యమని వైసిపి భావిస్తుంది. ఇలా చూసుకుంటే అదే సామాజిక వర్గానికి చెందిన శ్యామలాదేవి ఎన్నికల పోటీకి దిగితే క్షత్రియల ఓటు బ్యాంకు తనవైపే ఉండడంతో పాటు మరోపక్క తన పెద్దమ్మ శ్యామలాదేవి ఎన్నికల బరిలో ఉంటే హీరో ప్రభాస్ తప్పకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆమెకు ప్రభాస్ పూర్తి మద్దతు తెలుపుతారు. దీంతో ఫ్యాన్స్ ఓట్లు అటు ఆ ప్రాంతంలో అధికంగా ఉండే క్షత్రియ ఓట్లు వైసీపీకి పడతాయి. భీమవరం ఎంపీ సీటును వైసీపీ కైవసం చేసుకోవచ్చని ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే శ్యామల దేవితో వైసీపీలోని పలువురు ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకు శ్యామలాదేవి ఒక గృహిణిగా ఉన్నారు. ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనలేదు భర్త మరణం తర్వాత మనస్థాపానికి గురైన శ్యామలాదేవి పూర్తిగా ఇంటికే అంకితమయ్యారు. వైసిపి నేతల చర్చలు ఫలించి భీమవరం వైసీపీఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతారా అనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంసం అయింది. ఒకవేళ ఆమె ఒప్పుకొని వైసిపి తరఫున పోటీ చేస్తే వైసిపి ఆ ప్రాంతంలో విజయం కాయం అవుతుందాని వైసీపీ భావిస్తుంది. అయితే అసలు శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారా అని అంశంపై వేచి చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *