fbpx

యానిమేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి : తాటిపాక మధు

Share the content

యానిమేటర్లు కు ఉద్యోగ భద్రత కల్పించాలని,మూడు సంవత్సరాల కాల పరిమితి కి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 64 ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆర్పీలు యానిమేటర్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. మంగళవారం రాజమహేంద్రవరం స్థానిక గ్రౌండ్లో లో జిల్లా విస్తృతస్థాయి సమావేశం యూనియన్ అధ్యక్షురాలు ఎం శ్రీదేవి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తాటిపాక మధు ,ఎం శ్రీదేవి మాట్లాడుతూ…. ఎలాంటి వేతనాలు లేకుండా ఏళ్ల తరబడి సంఘాల ఏర్పాటుకు ,అభివృద్ధికి రాత్రి పగలు శ్రమ చేసినప్పటకి… మూడు సంవత్సరాల కాలపరిమితి విధించి తొలగించాలని నిర్ణయించడం అన్యాయం అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పేదరికంను నిర్మూలించాలి… కానీ యానిమేటర్ లను నిర్మూలించాలని కోవడం సరికాదన్నారు.

వివోఏ ల మెడ్జ్ చేయడం వలన వేలాది మంది వివోఏలకు ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఉపాధికి నష్టం లేకుండా ఎక్కువ సంఘాలు ఉన్న తక్కువ సంఘాల ఉన్న సర్దుబాటు చేయాలని ఎటువంటి రాజకీయ జోక్యం ఉండకూడదని వారు కోరారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఒఎ ల మీద కనికరం చూపి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. సీనియర్ యానిమేటర్ లకు ప్రమోషన్లు కల్పించాలని… ప్రతి నెల జీతం వ్యక్తిగత ఎకౌంట్లో వెయ్యాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 25,000 ఇవ్వాలని వారు కోరారు.ముందుగా ప్రభుత్వం చేపడుతున్న విధానాలను యూనియన్ ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి ప్రవేశపెట్టారు. భవిష్యత్తు కర్తవ్యాలను యూనియన్ కోశాధికారి కనక ఆమోదించారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా నాయకురాలు లలిత ఈశ్వరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *