fbpx

రైతును ఆదుకుంటారా…?

Share the content

అకాల వర్షాలకి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు రబీ పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు రైతులని నిలువున ముంచేస్తున్నాయి. వరి అధికంగా పండే ఉభయ గోదావరి జిల్లాలో పంట చేతికి వచ్చి ధాన్య అమ్మి సొమ్ము చేసుకునే సమయంలో అకాల వర్షాల కారణంగా కళ్ళల్లో వద్ద ఉన్న ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. వారితోపాటు మొక్కజొన్న పొగాకు రైతులు కూడా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో కూడా రైతులకి కష్టాలు తప్పడం లేదు. పండించిన ధాన్యం మిల్లులకు తరలించడానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు కనీసం గోనెసంచలు రవాణా సౌకర్యం లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కనీసం గోనెసంచలు సరఫరా విషయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తుందని, ఇచ్చిన అరకొర గుణసంచెలు కూడా పూర్తిగా నాణ్యత లోపిస్తుంది అంటూ ఆందోళన చెందుతున్నారు. కడుపు నింపే రైతులకు కడుపు మండి రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోల్లో ఆలస్యం కారణంగానే పంట నీటపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకి కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రైతులకు మద్దతు తెలుపుతున్న ప్రతిపక్షాలు..

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా నష్టపోయిన రైతులని పరామర్శించేందుకు ప్రతిపక్ష టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఉభయగోదావరి జిల్లాలో పర్యటించి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపటమే కాకుండా నష్టపోయిన మహిళ రైతు కి డబ్బు సహాయం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రూపంలో నష్టపోయిన రైతుని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వానికి లేఖ రూపంలో డిమాండ్ చేశారు.

రైతుల కోసం ప్రత్యేక కమిటీ…

ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాలో 7.35 లక్షల మెట్లు టన్నుల ధాన్యం లక్ష్యం కాగా 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల వద్ద నుండి కొనుగోలు చేసింది. మిగిలిన ధాన్యాన్ని త్వరలోనే రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది. ధాన్యాన్ని మిల్లుకు తరలించే సమయంలో గోనెసంచలు రవాణా సౌకర్యాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పౌరసరఫరా శాఖామంత్రి కనుమూరి నాగేశ్వరరావు స్వయంగా రైతుల వద్దకు వెళ్లి రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ప్రభుత్వం తరఫున అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లాలోని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా అదేసలు ఇచ్చారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం రైతులకు హామీ ఇస్తుంది.

ప్రభుత్వం ప్రతి ఏడాదిలానే రైతులను మభ్యపెట్టే మాటలు చెబుతుందా.. లేదా క్షేత్రస్థాయిలో రైతులను పూర్తిస్థాయిలో ఆదుకుంటారా అనే విషయాన్ని వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *