fbpx

రాయుడు కోపం ఎవరి మీద??

Share the content

క్రికెటర్ అంబటి రాయుడు కోపం ఎవరి పైన?? ఎమ్మెస్ కే ప్రసాద్ పైన లేక చాముండేశ్వరి నాథ్ పైనా?? లేక 2019లో ప్రపంచ కప్ ఆడిన భారత జట్టులో లేకపోవడం పైన?? అవన్నీ కాక వీళ్ళ అందరిని వెనకంచి నడిపించారు అని అనుకుంటున్నా కమ్మ కోటరి పైన..? అంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలోకి వెళ్లడం దాదాపు ఖరారు అయినట్లే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలోనూ క్రికెటర్ అంబటి రాయుడు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. వైసీపీ తరఫున రాష్ట్రమంతా ఆయన సేవలు వినియోగించుకోవాలని వైసిపి అధిష్టానం భావిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో రాయుడు వివిధ ఎలక్ట్రానిక్ ఛానల్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చినీయంశం అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చెబుతున్న అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి జరిగిన తీరు మీద అంబటి రాయుడు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. దీంతో అంబటి రాయుడు 2019 వరల్డ్ కప్ ఆడక పోవడం వెనుక కమ్మ పెద్దలు దాగి ఉన్నారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాయుడు కోపానికి కారణం ఏంటి?

స్వతహాగా ముక్కుసూటి తనంతో పోయే అంబటి రాయుడు తీరు ఆది నుంచి క్రికెట్లో కాస్త భిన్నమే. ఆంధ్ర తరఫున క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన రాయుడు తర్వాత హైదరాబాద్ వైపు మొగ్గారు. అయితే అక్కడ కూడా రాయుడుకు క్రికెట్లో ప్రతికూల పరిస్థితులు చూసి బరోడా తరఫున రంజీల్లో దిగాడు. అనంతరం ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేయడం తో భారత జట్టులో ఆగమనం చేశాడు. చిన్ననాటి నుంచే అద్భుతమైన ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న రాయుడు కచ్చితంగా భారత స్టార్ ప్లేయర్గా ఎదుగుతాడని అంతా భావించారు. 16, 17 ఏళ్లలోనే సెంచరీలు సాధించిన ఘనత రాయుడికి ఉంది. అయితే తర్వాత క్రికెట్లోని కొన్ని పరిణామాలు రాయుడు తీరుపై ప్రభావాన్ని చూపాయి. 2018 చివర్లో భారతదేశము తరఫున 2019 వరల్డ్ కప్ లో పాల్గొని భారత జట్టును ఎంపిక చేసే సమయంలో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా మాజీ వికెట్ కీపర్ ఎమ్మెస్ కే ప్రసాద్ ఉన్నారు. ఎమ్మెస్ కే ప్రసాద్ పూర్తిగా చంద్రబాబు మనిషి అని చెబుతారు. గోకరాజు గంగరాజు ఒకప్పుడు బీసీసీఐ మీద పూర్తిగా పట్టు సాధించిన సమయంలో చంద్రబాబు ప్రోద్భలంతోనే ఎమ్మెస్ కే ప్రసాద్ కు చీఫ్ సెలెక్టర్ పదవి లభించింది అని క్రికెట్ వర్గాలు ఇప్పటికీ చెబుతుంటాయి. అయితే ఎమ్మెస్ కే ప్రసాద్ ఎక్కడో ఉన్న విజయ శంకరును భారత జట్టులోకి సెలెక్ట్ చేసి అంబటి రాయుడు పూర్తిగా పక్కన పెట్టడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. అప్పట్లోనే అంబటి రాయుడు సామాజిక మాధ్యమాల వేదికగా 3d శంకర్ అంటూ వ్యంగంగా సెలెక్టర్లు మీద వ్యాఖ్యలు చేయడం, ప్రత్యక్షంగా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్ కే ప్రసాద్ మీద దాడి చేయడం అప్పట్లో సంచలనమైంది. స్వయంగా ఎమ్మెస్ కే ప్రసాద్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న సమయంలో ఎమ్మెస్ కే ప్రసాద్ కావాలని తనను భారత జట్టుకు ఎంపిక చేయలేదని అంబటి రాయుడు బలంగా నమ్మారు. దీని వెనుక కచ్చితంగా కమ్మ కోటరీ ఉంది అనేది, అలాగే ఎమ్మెస్ కే ప్రసాద్ ను వెనక ఉండి ప్రోత్సహించిన పెద్దల మీద అంబటి రాయుడు ఏహ్యత పెంచుకున్నారు. తర్వాత కాలంలో అంబటి రాయుడు చెన్నై జట్టుకు ఐపీఎల్ తరపున ఆడడం, చెన్నై సూపర్ కింగ్స్ సహాయజమాని ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ జగన్ కు అతి దగ్గర వ్యక్తి కావడంతో అంబటి రాయుడు సేవలను కచ్చితంగా వినియోగించుకునేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలోనే శ్రీనివాస జగన్ వద్దకు ప్రత్యేక అపాయింట్మెంట్ ఇప్పించి పంపించారు. గుంటూరు ప్రాంతానికి చెందిన అంబటి రాయుడు కచ్చితంగా స్టార్ క్యాంపెయిన్ అవుతారని వైసీపీ భావిస్తోంది. ఇది వచ్చే ఎన్నికల్లో తమకు బాగా ఉపయోగపడుతుందని, అంబటి రాయుడు ఎలాగూ తెలుగుదేశం మీద వ్యతిరేకతను ముందుగానే క్యాష్ చేసుకునేందుకు కూడా వైసీపీ పావులు కదుపుతోంది. ఇప్పటివరకు అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఎక్కడ బహిరంగంగా చెప్పలేదు కానీ.. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని జగన్ బలంగా భావిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *