fbpx

ముస్తఫా బ్రేక్ డాన్స్!

Share the content

గుంటూరు రాజకీయాల్లో ఇప్పుడు కీలక పరిణామాలు ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నాయి. తాజాగా నగరపాలక సంస్థ సమావేశాల్లో రెండు రోజులపాటు జరిగిన అన్ని పరిణామాలు ఇప్పుడు అధికార పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. నగర పాలక సంస్థ సమావేశంలో ఐప్యాక్ ప్రతినిధులు ఉండడం, వారిని బలవంతంగా బయటకు తీసుకురావడం మాట అటు ఉంచితే, దానిని మీడియం ముఖంగా బయట పెట్టడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. నగర పాలక సంస్థ సమావేశంలో బయట వ్యక్తులు అందులోను సర్వే టీంలు ఎందుకు ఉన్నాయంటూ అధికారపక్షంలోని కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ప్రశ్నించడం కూడా అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలను బయటపెట్టింది. ముఖ్యంగా నగరపాలక సంస్థ సమావేశాల్లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా చేసిన వ్యాఖ్యలు, నగర పాలక సంస్థ అధికారులు కనీసం మౌలిక వసతులు కల్పించడం లేదంటూ ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా తాను చెప్పిన వినిపించుకోవడం లేదంటూ చెప్పడం రాజకీయంగాను కొత్త సమీకరణాలకు కారణం అని భావిస్తున్నారు. ఐప్యాక్ ప్రతినిధులు సైతం గుంటూరు నగరపాలక సంస్థ సమావేశంలో ముస్తఫా తీరు ఎలా ఉంటుందో పరిశీలించడానికి వచ్చారు అన్నది కూడా అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

ముస్తఫా దారి ఎటువైపు?

వరుసుగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముస్తఫా ముస్లిం వర్గంలో మంచి పట్టు ఉన్న నేత. 2014 లోను గెలిచిన ఆయన గుంటూరు తూర్పు పరిధిలో కీలకమైన నేతగా ఎదిగారు. ముస్లిం కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని మొదట భావించారు. అయితే జగన్ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం మంత్రివర్గ వ్యక్తుల్లో కనీసం ఆయన పేరును పరిశీలించకపోవడంతో అప్పటినుంచి ముస్తఫా సైలెంట్ గా ఉన్నారు. ఆయన కూతురుని రాజకీయంగా బరిలో దింపేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా వైఖరి పూర్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో సీటు కేటాయించే అవకాశం అధికార పార్టీ నుంచి లేకపోవడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా సర్వేలు రావడంతో ఇప్పుడు ఆయన పార్టీ వీడెందుకు సిద్ధమవుతున్నారు అని తెలుస్తోంది. దానికి సాకుగానే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దారిలో నడుస్తున్నారు. ప్రజా సమస్యలను సాకుగా చూపిస్తూ ఆయన అధికార పార్టీ తీరు మీద అధికారుల పనితీరు మీద బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు విశేషం. రెండు పర్యాయాలు ఆయన చెబితేనే ముందుకు కదిలిన అధికారులు చివరి సంవత్సరంలో మాత్రం పూర్తిగా ఆయనకు శత్రువులుగా మారడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యంకి గురిచేస్తుంది. ముస్తఫా రాజకీయ క్రీడలో భాగంగానే అధికారులను బాధ్యులను చేస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం తనకు గాని తన కూతురికి గాని టికెట్ కేటాయించే అవకాశం లేదని తేలడంతోనే ముస్తఫా ఇప్పుడు హంగామా చేస్తున్నారని అధికార పార్టీలోని నేతలు చెబుతున్నారు. ముస్తఫా పని తీరు మీద పూర్తిస్థాయి సర్వే తెప్పించుకున్న అధిష్టానం ఆయనకు నియోజకవర్గం అంతా వ్యతిరేకంగా మారిందని, సొంత సామాజిక వర్గంలోనూ ఆయనకు పూర్తిగా వ్యతిరేకవర్గాలు తయారయ్యాయని వచ్చే ఎన్నికల్లో ముస్తఫా గెలుపు దాదాపు అసాధ్యం అని తేలడంతో ఆయనకు ఎప్పటికీ అధిష్టానం నుంచి పలు సంకేతాలు అందాయి. ఆఖరికి కూతురికి టికెట్ కేటాయించాలని అడిగిన, వైసీపీ అధిష్టానం సశమేరా అనడంతోనే ముస్తఫా కొత్త పల్లవి అందుకున్నారు. టిడిపిలోకి వచ్చేందుకు శత విధాల ఆయన ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిడిపి టికెట్ కేటాయిస్తే కచ్చితంగా పార్టీ మారేందుకు సిద్ధమని కూడా టిడిపి గుంటూరు జిల్లా నాయకులు వద్ద ముస్తఫా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ముస్తఫా ప్రాబల్యం తూర్పు నియోజకవర్గం లో ఏమీ లేదని, ఆయనను టిడిపి నుంచి పోటీ చేయించిన ప్రయోజనం ఉండదని టిడిపి పెద్దలు భావిస్తుండడంతోనే ఆయన చేరికకు ఇంకా గ్రీన్ సిగ్నల్ పడలేదు. దీంతో ఇప్పుడు గుంటూరు తూర్పు రాజకీయాలు ఎటువెళ్లి ఎటు తిరుగుతాయోనన్న ఆసక్తి వ్యక్తం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *