fbpx

జూన్ 7వ తేదీన ఏం జరగబోతోంది..?

Share the content

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ అత్యవసర సమావేశం జరగనుందా? ముందస్తు ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది..? ఎందుకీ హడావుడి..? జూన్ 7వ తేదీ పై రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూలమైన మీడియాలో జూన్ 7వ తేదీన కీలకమైన చర్చ జరగబోతుందని, క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వ రుద్వాంసాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం స్పష్టంగా ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి తగినట్లుగానే ఇప్పటివరకు చాలా నిశ్శబ్దంగా ఉన్న జనసేన పార్టీ తన వారాహి యాత్ర తేదీని సైతం ప్రకటించింది. మరోపక్క అన్ని రకాలుగాను ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు సైతం రెండు మూడు రోజుల్లో కీలకమైన సమావేశం నిర్వహించనున్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెరిగిపోతుంది. జూన్ 7వ తేదీన కీలకమైన అంశం బయటికి వచ్చే అవకాశం ఉందని ప్రతిపక్షాలు తాలూకా సర్కిలలో విపరీతమైన చర్చ జరుగుతుంది.

అదేం లేదు అంటూనే

అధికార పక్షం వైసీపీ నాయకులు వారి అనుచరులు మాత్రం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఏమీ ఉండవని చెబుతున్నారు. అయితే దానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని చెప్పడం మళ్ళీ అనుమానాలకు తావిస్తోంది. జగన్ అనుకూల మీడియా కూడా జూన్ 7వ తేదీన రాష్ట్రంలో ఏదో జరగబోతోంది అన్న చర్చను ఖండించడం లేదు. జూన్ 7వ తేదీన కచ్చితంగా క్యాబినెట్ బేటి ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పటికీ స్పష్టత లేదు. అధికార వర్గాల్లో ప్రభుత్వం నుంచి దీనిపై సమాచారం కూడా లేదు. మరో ఐదు రోజుల్లో కీలక భేటీ ఉన్న సమయంలో కనీసం ఏ ప్రజా ప్రతినిధికి దీనిపై స్పష్టత లేకపోవడం దీనిపై కాస్త తెలిసిన వారంతా చాలా నిశ్శబ్దంగా ఉండి పోవడం కూడా కొత్త సంకేతాలను రేపుతోంది. రాబోయే ఎన్నికలకు కచ్చితంగా జూలై 7 ఒక పెద్ద వార్తను పట్టుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్న తరుణంలో ఒకవేళ ముందస్తు ఎన్నికలుకు వెళితే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడే అంచన వేయలేం. అయితే వైసీపీ పెద్దలు సైతం ముందస్తు ఎన్నికలకు అంతగా సిద్ధంగా లేరు అనేది అంతర్గత సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *