fbpx

ఈడీ కేసుకు పవన్ కళ్యాణ్ కి సంబంధం ఏంటీ?

Share the content

చంద్రబాబు నాయుడు మీద వచ్చిన అవినీతి ఆరోపణలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించడం లేదు అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం విస్తృతంగా ప్రచారం చేస్తోంది.. కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాగుడుమూతలు ఆడుతున్నారంటూ, వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షులుగా పోటీ చేయాలని భావిస్తున్న ఇరు పార్టీలకు ఇది మంచిది కాదు అంటూ రకరకాల వ్యాఖ్యలు పోస్టులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ విషయంలో ఇదే నచ్చని విషయం. టిడిపికి పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయారని ప్యాకేజీ తీసుకున్నారు అని రకరకాలుగా వైసిపి సోషల్ మీడియా విభాగం ప్రచారం చేసిన ఏనాడు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం గానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం గానీ స్పందించిన దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ కు ప్యాకేజీ తీసుకోవలసిన కర్మ ఏం పట్టిందని ఆయన పూర్తిస్థాయి నిజాయితీపరుడు అని తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు గానీ లోకేష్ గాని ఎక్కడ స్టేట్మెంట్లు ఇచ్చిన దాఖలాలు కనిపించవు. ప్రతిసారి ప్యాకేజీ స్టేట్మెంట్లను పవన్ కళ్యాణ్ ఖండించడం దానిపై గట్టిగా హెచ్చరికల పంపడం తప్పితే విపక్షంగా అధికార పార్టీపై పోరాడాల్సిన తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఎలాంటి స్పందన ఉండదు. వైసిపి సోషల్ మీడియా విభాగం కావాలనే ప్రచారం చేస్తుంది అని ఎక్కడ చెప్పిన దాఖలాలు కూడా కనిపించవు. దీనిని కొనసాగిస్తూనే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ ను ఎంత చిన్న బుచ్చితే అంత తమకు మేలు జరుగుతుంది అని టిడిపి ఆడిన మైండ్ గేమ్ లో భాగమే ఇది. పవన్ కళ్యాణ్ ప్యాకేజీలకు అమ్ముడు పోతాడు అని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఎంతో కొంత సానుభూతి మైలేజీ వస్తుంది అన్నది, తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ అని చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని దీనిని ఎప్పుడూ రాజకీయంగా వాడుకోవడం తప్పితే ఆ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ఖండించింది లేదు. దానిని కొనసాగించింది కూడా.. అయితే ఇప్పుడు చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా అవినీతి విషయాల్లో చిక్కుకుపోవడం దీనికి సంబంధించి ఈ డి నోటీసులు కూడా జారీ చేయడం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి కచ్చితంగా ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి.

అమరావతి నిర్మాణాల్లో భాగంగా పల్లోంజీ సంస్థ నుంచి 118 కోట్ల వరకు చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని ఇది ఈడీ విచారణలో బహిరంగంగా తేలడంతో నోటీసులు జారీ చేసింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థ. కొన్ని తనిఖీల్లో భాగంగా రాసుకున్న డైరీలో చంద్రబాబు పేరు కనిపించడం దానిని లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగు చూడడంతో ప్రాథమిక సాక్షాదారాలు మేరకే ఈడి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. దీనిపై సమాధానం చెప్పాల్సిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జనసేన మీద అనూహ్యంగా దాడి చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ని ఉమ్మడిగా ఎదుర్కొందామని చెప్పిన జనసేన తెలుగుదేశం పార్టీ అధినేత పై వచ్చిన ఆరోపణల విషయంలో స్పందించడం లేదు అని తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు తెగ బాధ పడిపోతున్నారు. అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమీ అంటే వైసీపీకి ఈడి నోటీసులకు ఎక్కడ సంబంధం లేదు. వీడి ఒక కేసు నిమిత్తం వెళ్లి అక్కడ దొరికిన సాక్ష్యధారాల మేరకు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. దీనికి పూర్తిగా కేంద్ర దర్యాప్తు సంస్థకు చంద్రబాబు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రభావితం చేయగల సంస్థ కూడా కాదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఏ విషయంలో మద్దతు తెలపాలి లేదు అన్నది ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుసుకోవాల్సిన అంశం. ఇప్పటివరకు అవినీతి ఆరోపణల్లో భాగమైన వారికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపింది సంఘీభావం తెలిపింది లేదు. ఈనాడు మార్గదర్శి కేసులో కూడా రామోజీరావును కక్షగట్టి వైసీపీ ప్రభుత్వం వేదించడంతోనే జనసేన పార్టీ సంఘీభావం తెలిపింది. అలాంటి పరిస్థితి చంద్రబాబు కేసులో లేదు. ఇది పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసు కాబట్టి దీనిపై పూర్తిగా న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సింది చంద్రబాబు కాబట్టి పవన్ కళ్యాణ్ దీనిలో స్పందించిన పెద్దగా ప్రభావం ఉండదు. పైగా ఇది వైసీపీకి సంబంధంలేని విషయం. దీన్ని పట్టుకొని వైసీపీని నిందించలేరు. భారతీయ జనతా పార్టీ చేపించింది అని భావిస్తే పవన్ కళ్యాణ్ ఖండించే పరిస్థితి లేదు. ఇవన్నీ చూసుకుంటే ఈ కేసు మీద అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించాలి అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. చట్టం తన పని తాను చేసుకు పోతున్నప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపడం వల్ల స్పందించడం వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. కచ్చితంగా దీనికి చంద్రబాబు జవాబు చెప్పుకోవాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *