fbpx

ఆంధ్రలో కెసిఆర్ పార్టీ ఏమైంది..?

Share the content

ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం అని చెప్పిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా కనబడకుండా పోతుంది. చాలా హడావుడిగా పార్టీ కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేసి పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ను నియమించిన కేసీఆర్ తర్వాత రాష్ట్రంలో పెద్దగా కార్యక్రమాలు నిర్వహించింది లేదు. అసలు పార్టీని ఎందుకు ఇక్కడ మొదలుపెట్టారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఎన్నికల్లోనే విఆర్ఎస్ పరిస్థితి అటు ఇటుగా ఉండడంతో అక్కడ రాజకీయాల్ని ప్రధానంగా చేస్తున్న కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రభావితం చేసే కార్యక్రమాలు మొదలు పెట్టలేకపోయారు.

** టిఆర్ఎస్ ను పూర్తిస్థాయిలో భారత దేశంలో విస్తరిస్తామని చెప్పిన కేసీఆర్ దానిలో భాగంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో విస్తరించాలని మొదట అనుకున్నారు. దీనికి తగినట్లుగా మొదట్లో కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు. కెసిఆర్ ప్రధానంగా దృష్టి పెడితే చాలా మంది కీలకమైన నేతలను ఇతర పార్టీల నుంచి తీసుకునే వారే.. కానీ కెసిఆర్ తెలంగాణ రాజకీయాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టడం ఆయన ఆరోగ్యం కూడా అంతంతమాత్రం గానే ఉండడంతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో టిఆర్ఎస్ రాజకీయాలు ఏమీ లేకుండా ఆగిపోయాయి. మొదట్లో చిన్న చితకానేతలు పార్టీలో చేరినప్పటికీ వారి పత్తా కూడా లేకుండా పోయింది. గుంటూరు కార్యాలయాన్ని తెరిచే నాధుడు కూడా లేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కొందరు నాయకుల్ని అయిన పార్టీలోకి తీసుకువచ్చి బలోపేతం చేయాలని భావించినప్పటికీ ఆయన ప్రయత్నాలు కూడా ఏమాత్రం ఫలించలేదు. దీంతో తోట చంద్రశేఖర్ కూడా తన వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నం అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంచి కాకా మీద ఉన్న పరిస్థితుల్లో కనీసం బిఆర్ఎస్ వాటి వైపు చూసిన పరిస్థితి కూడా లేదు. తెలంగాణ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి టిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ముందుకు వెళ్లాలి అన్నది నిర్ణయం కావచ్చు. ఇప్పటికిప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టిఆర్ఎస్ ప్రభావం చూపేది సున్నా. కెసిఆర్ మొదట తెలంగాణలో గెలిస్తే తర్వాత ఇతర ప్రాంతాల వైపు చూడవచ్చు అని భావిస్తున్నారు. ఈ కారణంగానే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు ప్రస్తుతం నిస్తేజాంలో ఉంచారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గనుక కేసీఆర్ ప్రభుత్వం వస్తే బిఆర్ఎస్ కార్యక్రమాలు మరికొన్ని రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో సైతం వచ్చే ఎన్నికల్లో కీలకంగా అయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా తెలంగాణలో అటు ఇటుగా ఫలితాలు వస్తే మాత్రం బిఆర్ఎస్ విస్తరణ పూర్తిగా ఆగిపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *