fbpx

రెండు పార్టీలకు చింతలే..!

Share the content

ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాల్లో కీలకమైన నియోజకవర్గంగా ఉన్న చింతలపూడి రాజకీయం మాత్రం ఇప్పటికీ ఒక స్పష్టత లేదు. అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీ టిడిపి కూడా ఇక్కడి నుంచి ఎవరిని నిలపాలి అన్నది తేల్చుకోలేక పోతుంది. చింతలపూడి నియోజకవర్గ రాజకీయం ముఖ్యమైన వైసీపీ టిడిపిలకు పెద్ద తలనొప్పిగా మారింది.

వైసీపీకి నాయకత్వం లేదు

నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం గా మారిన చింతలపూడిలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. ఒకప్పుడు కోటగిరి విద్యాధరరావుకు పెట్టని కోటగా ఉన్న చింతలపూడిలో నియోజకవర్గాల పుర విభజన తర్వాత నా నాయకత్వం లేమి స్పష్టంగా కనిపించింది. ఎస్సీ సామాజిక వర్గ నాయకులు బలంగా లేకపోవడంతో అక్కడ బయట ప్రాంతాల నుంచి వచ్చే వారే అధికంగా ఎమ్మెల్యేలు అయ్యారు. ప్రస్తుత చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా ఒక ఐఆర్ఎస్ అధికారి. చింతలపూడి తో ఏమాత్రం సంబంధంలేని ఎలిజాను 2019లో అభ్యర్థిగా నిలబెట్టడం జగన్ గాలిలో ఆయన మంచి మెజారిటీతో గెలుచుకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఎలిజ మీద పలు రకాలుగా వ్యతిరేకత రావడంతో కొత్త కొత్త పేర్లు వచ్చే ఎన్నికలకు వినిపిస్తున్నాయి. చింతలపూడి నుంచి ఏలూరులో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జయ రాజు అనే వ్యక్తి పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతోపాటు ప్రస్తుత ఎమ్మెల్యే ఎలీజా చింతలపూడి పై ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు. కేవలం అతిధిలా నియోజకవర్గం లో పర్యటిస్తున్నారు తప్పితే అక్కడ ఉన్న సమస్యల మీద స్థానికంగా ఉండే నాయకత్వాన్ని బలపరచడం మీద దృష్టి పెట్టడం లేదు. దీంతోపాటు చింతలపూడి నియోజకవర్గం మొత్తం మీద ఇప్పటివరకు బలమైన నాయకత్వం అధికార పార్టీకి దొరకడం లేదు.

టీడీపీ ది అదే పరిస్థితి

2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గం నుంచి పీతల సుజాతను బరిలోకి నిలిపింది. ఆమె మంచి మెజారిటీతో గెలుచుకు రావడం రాష్ట్ర మంత్రివర్గంలో సైతం చోటు సంపాదించడం చేశారు. అయితే తర్వాత నియోజకవర్గానికి ఆమె దూరంగా జరిగారు. ఆమెకు పూర్తిగా సంబంధం లేని నియోజకవర్గం కావడంతో కేవలం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి పెద్దగా చేసింది ఏమీ లేదు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కర్ర రాజారావు సైతం ఇటీవల మృతి చెందడంతో ఇప్పుడు టిడిపి సైతం అక్కడ నాయకత్వం గురించి ఆలోచనలో పడింది. మాజీ జడ్పీ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు చింతలపూడి నియోజకవర్గంగా రాజకీయాలనిపిస్తున్నారు. మరోపక్క మాజీ మంత్రి పీతల సుజాత సైతం ఎక్కడి నుంచి పోటీ చేయాలని గట్టిగా భావిస్తున్నారు. అలాగే టిడిపిలో మూడో వర్గం కూడా చింతలపూడిలో ఉంది. ఎవరిని కాదన్నా ఈసారి చింతలపూడిలో గ్రూపు విభేదాలు టిడిపిని ఓడించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చింతలపూడి నాయకులతో చంద్రబాబు నాయుడు రెండుసార్లు మాట్లాడిన ఫలితం లేకపోయింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం భారీగా ఆసవాకులు ఉండడంతో టీడీపీ సైతం ఎక్కడ నాయకత్వం గురించి ఆలోచన చేయలేకపోతోంది. దీంతో చింతలపూడి రాజకీయం ఇరుపక్షాలకు ఇప్పుడు లేనిపోని తలనొప్పులను తీసుకువచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *