fbpx

వైసీపీకి ఆశకిరణం.

Share the content

కాపులు ఓట్లను ఎలాగైనా తమ వైపుకు తిప్పుకోవాలని వ్యూహాలు వేస్తున్న అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో వంగవీటి రంగా తనయురాలు ఆశాలతను తమ వైపు తిప్పుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈసారి కాపుల ఓట్లు పూర్తిస్థాయిలో జనసేనకు వెళ్తాయని సర్వేలు తేలుతుండడంతో వైసీపీ అప్రమత్తమైంది. ఇటీవల ముద్రగడ పద్మనాభం ను తెరమీదకు తీసుకువచ్చి లేఖలు రాయించిన వైసీపీ అధిష్టానం ఆ పాచిక పారకపోవడంతో బలమైన కాపు అభ్యర్థిని కాపు ఓటర్లలో ప్రభావితం చేసే నాయకులు కోసం వెతుకులాట ప్రారంభించింది. వంగవీటి రంగా తనయుడు రాధా ను తిరిగి వైసీపీలోకి తీసుకురావాలని చేసిన ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో ఇప్పుడు రంగా కుమార్తె ఆశాలతను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాపులు రంగాను అధికంగా నమ్ముతారు. కాపులకు ఐకాన్ గా రంగాను భావిస్తారు. దీంతో కచ్చితంగా రంగా కూతురు వైసీపీలోకి వస్తే ఎలాగైనా సరే తమకు అనుకూలంగా మారుతుందని వైసీపీ లెక్కలు వేస్తోంది.

వంగవీటి రాధా టిడిపిలోకి వెళ్లినప్పటికీ గత ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయలేదు. కేవలం తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపైనర్ గా మాత్రమే వ్యవహరించారు. అయితే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి దూరంగా జరిగిన రాధా రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. దీంతో వైసిపి అధిష్టానం నుంచి కొడాలి నాని వల్లభనేని వంశీ వంటి రాధాకు దగ్గరగా ఉండే వారికి తగు ఆదేశాలు వెళ్లాయి. రాధా మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తే ఖచ్చితంగా మంచి పదవి ఇద్దామని, తిరిగి మళ్లీ వంగవీటి రాధాను పార్టీలోకి తీసుకువచ్చేలా మాట్లాడాలని కొడాలి నాని వంటి వారికి బాధ్యతలు అప్పగించారు. అయితే వంగవీటి రాధ మాత్రం తిరిగి వైసీపీ లోకి వెళ్లేందుకు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఆ మధ్యకాలంలో వంగవీటి రాధా జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగిన ఆయన రాజకీయంగా ఏ స్టెప్ తీసుకోలేదు. దీంతో స్తబ్దుగా ఉన్న రాధా ఇక వైసీపీలోకి రాడని బలంగా భావిస్తున్న వైసీపీ అధిష్టానం రంగా కూతురు వైపు దృష్టిసారించింది. ఇప్పటివరకు రాజకీయాల్లో లేని ఆమెను తెరపైకి తీసుకువచ్చి వెనకనుంచి మొత్తం కథ నడిపించాలని వైసీపీ భావిస్తుంది. ఆశాలతకు తోడుగా ముద్రగడ పద్మనాభం వంటి కాపు నేతలను రంగంలోకి దించి వచ్చే ఎన్నికల్లో కాపు ఓటర్లను ప్రభావితం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఆశాలతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్న ఆమె త్వరలోనే నిర్ణయాన్ని చెబుతానని చెప్పినట్లు సమాచారం. వంగవీటి రాధ తో ఆశాలతకు మంచి సంబంధాలు ఉన్నాయి. అన్నా చెల్లెలు సఖ్యత గానే ఉంటారు. దీంతో ఇప్పుడు రాధా రాజకీయ బౌద్ధం వైపు పాఠశాల నిర్ణయం ఏమైనా ప్రభావితం చేస్తుందా.. లేక ఆశాలత వైసిపిలోకి వెళ్ళనని నిర్మొహమాటంగా చెబుతారా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లను ఎలా అయినా తన వైపు తిప్పుకోవాలని అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు ముమ్మారం చేస్తున్న వైసీపీ అధిష్టానానికి ఇప్పుడు ఆశాలతా ఒక ఆశా కిరణంలా కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *