fbpx

సచివాలయ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

Share the content

రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్లకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు కాకినాడ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు దువ్వ శేషాబాబ్జి, చెక్కల రాజ్ కుమార్ పత్రికా ప్రకటన విడుదల చేసారు. వాలంటీర్లను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని తెలిపారు.కార్మిక చట్టాలు అమలు చేయాలని, ఉద్యోగభద్రత కల్పించాలని పేర్కొన్నారు.తమను కట్టుబానిసల్లా పనిచేయించడాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయ వాలంటీర్లు డిశంబర్ 29 నుండి నిర్వహించబోయే సమ్మెకు సిఐటియు జిల్లా కమిటి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని వెల్లడించారు. నాలుగున్నర సంవత్సరాలుగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్లుకు ఎటువంటి కనీస వేతనాలు, పనిగంటలు, విధి విధానాలు లేకుండా పని చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల వేధింపులు, తూలనాడడం, చులకన భావంతో చూడడం వంటి ఇబ్బందులకు గురౌతన్నప్పటకి సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. అనేక ఇబ్బందులకు ఓర్చి కోవిడ్ కాలంలో కూడా సేవలందించారని పేర్కొన్నారు. పదుల సంఖ్యలో కోవిడ్ వలన చనిపోయారని వాపోయారు. ప్రభుత్వం వీరి న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా దుర్మార్గంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవవేతనం పేరిట అగౌరవంగా అతి తక్కువ వేతనాలతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయించుకుంటున్నదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాలంటీర్లను కట్టుబానిసల్లా చూస్తూ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయించుకుంటున్నదని పేర్కొన్నారు. కేవలం ప్రసంసలే తప్ప కనీస వేతనాలను చెల్లించడంలేదని అన్నారు. వాలంటీర్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనీసవేతనం చెల్లించాలని, సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని, జాబ్ చార్ట్ ఇవ్వాలని, కార్మిక చట్టాలు అమలు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *