fbpx

టీడీపీతోనే ఆర్ ఆర్ ఆర్

Share the content

వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏ పార్టీలో చేరుతారు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు అన్న సంశయం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన రఘురామకృష్ణంరాజు ఆ పార్టీ ఎంపీగానే కొనసాగుతున్నప్పటికీ ఏపీ ప్రభుత్వ తీరు మీద మాత్రం ఎప్పటికప్పుడు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. న్యాయపరంగా తనను డిస్ క్వాలిఫై చేయడానికి వీలులేని పద్ధతిలో రఘురామకృష్ణంరాజు గత నాలుగేళ్ల నుంచి నెట్టుకొస్తున్నారు. మొదటినుంచి పూర్తి స్థాయిలో వైసిపికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్న కృష్ణంరాజు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా నరసాపురం ఎంపీ గానే పోటీ చేస్తాను అని ఇప్పటికే స్పష్టం చేశారు. అది తెలుగుదేశం పార్టీ నుంచ జనసేన పార్టీ నుంచా అనేది త్వరలో తేలుతుందని ఆయన గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తాయని తేలడంతో ఇప్పుడు ఆయన ఏ పార్టీ నుంచి బరిలో నిలుస్తారు అన్న స్పష్టత ఇంకా రాలేదు.

** రఘురామకృష్ణంరాజు వచ్చే ఎన్నికల్లో దాదాపు తెలుగుదేశం పార్టీ తరఫున నరసాపురం ఎంపీగా పోటీ చేస్తారు అని తెలుస్తోంది. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో టిడిపి తరఫున ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ పోటీ చేశారు. అప్పటికే సిట్టింగ్ గా ఉన్న కలవపూడి శివను అధినేత చంద్రబాబు దగ్గరుండి మరి నరసాపురం ఎంపీగా నిలబెట్టారు. అక్కడి నుంచి గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ అన్నయ్య కొణిదెల నాగబాబు పోటీ చేశారు. ముక్కోనపు పోరులో రాజు విజయం దక్కించుకున్నారు. అయితే వచ్చే ఎన్నికలకు మళ్లీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కలవపూడి శివ ఏమాత్రం సిద్ధంగా లేరు. అందులోనూ నరసాపురం నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 2010లో ఎమ్మెల్యేగా గెలిచిన బండారు మాధవ నాయుడు తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండడం… ఆయన స్థానంలో ఇన్చార్జిగా పనిచేసిన వెంకట్రామరాజు అంతగా యాక్టివ్గా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీలో నిస్తేజం నెలకొంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని స్థానిక కేడర్ బలంగా చెబుతున్నారు. రఘురామకృష్ణంరాజు వస్తే ఇప్పటికే స్వాగతించడానికి క్యాడర్ సిద్ధంగా ఉంది. ఈసారి ఎన్నికలు రఘురామకృష్ణంరాజుకు కూడా ప్రతిష్టాత్మకమైనవి కావడంతో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ లో చేరి జనసేన పార్టీ మద్దతుతో ఈజీగా నెగ్గుకు రావచ్చు అని రాజు భావిస్తున్నారు. నర్సాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న తాడేపల్లిగూడెం భీమవరం పాలకొల్లు నరసాపురం ఉండి తణుకు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి బలంగా ఉన్నవేళ చాలా సులభంగానే నెగ్గుకు రావచ్చు అని రఘురామకృష్ణంరాజు భావిస్తున్నారు. దీంతో సరైన సమయం చూసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని.. వచ్చే ఎన్నికలకు కృష్ణంరాజు సిద్ధమైపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *