fbpx

వారసుల కోసం..

Share the content

వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు తమ కొడుకులను రంగంలోకి దింపాలని తెగ తాపత్రయ పడుతున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం పెద్దల దృష్టికి కూడా తమ కొడుకులను వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దింపి టికెట్ తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిలో ఎప్పటికీ చాలామంది సఫలీకృతం కాగా ఇంకా మిగిలిన వారికి మాత్రం వైసీపీ అధిష్టానం స్పష్టత ఇవ్వడం లేదు. ముఖ్యంగా వైయస్ జగన్ సామాజిక వర్గానికి చెందిన నేతల పిల్లలకు మళ్లీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు ఎక్కువగా సుముఖత చూపుతున్నారని మిగిలిన వారిని ఆయన హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమాన అభినయ రెడ్డి పేరును, అలాగే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి కొడుకు వంశి పేరు బలంగా వినిపిస్తోంది. రామచంద్రపురం టికెట్ కోసం పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు రంగంలోకి దిగేందుకు సమయత్తం అవుతున్నారు. మచిలీపట్నం నుంచి పేర్ని నాని కొడుకు పేరుని కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో బరిలో నిలుస్తారని తెలుస్తోంది. అలాగే అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ బాబు కొడుకు సింహాద్రి వరుణ్ కు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. గుంటూరు తూర్పు నుంచి ముస్తఫా కుమార్తె బరిలో నిలుస్తారు. ఇలా ఇంకా కొన్ని నియోజకవర్గాల నుంచి వారసుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. తమకు టికెట్ కేటాయించక పోయిన పర్వాలేదు కానీ వారసత్వాన్ని మాత్రం కొనసాగించాలని కొందరి నేతలు తాపత్రయ పడుతున్నారు. మొత్తం అంతా తాము వెనుక ఉండి చూసుకుంటామని కొడుకులను మాత్రం ఎమ్మెల్యేలుగా ప్రమోట్ చేసేందుకు చూస్తున్నారు. అయితే వైయస్ జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం లోని పరిస్థితిని సర్వేలను బట్టి మాత్రమే వారసులలో రంగంలోకి దింపేందుకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. నియోజకవర్గ వారీగా సర్వేలు నిర్వహిస్తున్న ఐ ప్యాక్ టీం ఇచ్చిన సర్వేలో ఆధారంగానే ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *