fbpx

భవన నిర్మాణ కార్మికులకే సెస్ నిధులు ఖర్చు చేయాలి : తోకల ప్రసాద్

Share the content

రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కొరకు వసూలు చేస్తున్న సెస్ నిధులు వారికే ఖర్చు చేయాలని కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (భవన నిర్మాణ కార్మిక సంఘం) నెలవారి సమావేశం ఆదివారం కాకినాడలో స్థానిక వీర్ కమల్ థియేటర్ వద్ద పి.జి.ఆర్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తోకల ప్రసాద్ మాట్లాడుతూ…భవన నిర్మాణ కార్మికులు… ప్రమాదాలకు గురై కాలు, చేయి విరిగిన, సాధారణ మరణం సంభవించిన…ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కొరకై ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పడిందని, ఈ సంక్షేమ బోర్డు ఏర్పడుటకు అనేక సంవత్సరాల పోరాటం ఉందని ఉందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 2009లో సంక్షేమ బోర్డు అమల్లోకి వచ్చిందని, ఆ సంక్షేమ బోర్డుకు కోట్లాది రూపాయల నిధులు సెస్ రూపంలో వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.. కానీ ఆ సెస్ నిధులు ఒక్క రూపాయి కూడా భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆర్భాట ప్రచారాలు, రాజకీయ లబ్ది కొరకు వాడుకుంటుందని విమర్శించారు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మ్యారేజ్ గిఫ్ట్, డెలివరీ, సాధారణ మరణం, యాక్సిడెంట్, ఆస్పటల్లైజేషన్ తదితరుల క్లెయిమ్స్ సుమారుగా ఐదు కోట్ల రూపాయల నిధులు పెండింగ్లో ఉన్నావని వెల్లడించారు. వాటిని తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

కాకినాడ స్మార్ట్ సిటీ కాకుండా ఫ్లెక్సీ సిటీగా పేరు మారిస్తే బాగుంటుందని, ఎక్కడ చూసిన ఫ్లెక్సీలు ప్రదర్శన గా కనబడుతున్నాయని, ఈ ఫ్లెక్సీ కారణంగా ఆర్టిస్టులు ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన ఆర్టిస్టులకు ప్రభుత్వం యాడ్స్ కల్పించి… ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాల బోర్డ్స్ రాతపూర్వకంగా రాసేలా ఆర్టిస్టులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎన్నికల్లో పు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగించి, అమలు చేయాలని… సాధారణ మరణానికి వయసుతో సంబంధం లేకుండా కార్మికుడు ఎప్పుడు చనిపోయిన ఆ పథకం వర్తించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 7వ తేదీన భవన నిర్మాణ కార్మికుల, ఏఐటీయూసీ జిల్లా సమితి సమావేశాలు జిల్లా సమావేశాలు సామర్లకోటలో జరగనున్నాయని, ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీ . అన్నవరం, శ్రీను, పి .శివ, అచ్చా రావు, కుమార్, ఆర్టిస్టులు సంఘం అధ్యక్షులు ఉల్లి శెట్టి విజయభాస్కర్, బండారు రాజశేఖర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *