fbpx

తిరుమల భక్తులపై చిరుతల దాడికి అసలు కారణం ఇదే!

Share the content

2019 వరకు శేషాచలం అడవుల్లో రోజుకు ఒక ఎర్రచందనం కేసు అయినా ఉండేది. ఎర్రచందనం తరలించుకుపోకుండా తమిళనాడు వైపు వెళ్లకుండా కాపలా కాసేందుకు ఎర్రచందనం ప్రత్యేక రక్షణ దళం చాలా యాక్టివ్ గా ఉండేది. దానికి ఇన్స్పెక్టర్ జనరల్ వంటి ఐపీఎస్ అధికారి పర్యవేక్షణ ఉండేది. 2019 వరకు ఆ పోస్టులో సీనియర్ ఐపీఎస్ అధికారి మాగంటి కాంతారావు చాలా యాక్టివ్ గా పని చేసేవారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా ఎర్రచందనం కేసులు మరుగున పడిపోయాయి. ఎర్రచందనం రక్షణ ప్రత్యేక దళం అసలు ఉందో లేదో కూడా తెలియదు. ఐపీఎస్ స్థాయి అధికారిని అక్కడి నుంచి తీసివేశారు. రోజుకు కాదు కదా నెలకు ఒక్క కేసు కూడా బయట పడడం లేదు. కొంపతీసి శేషాచలంలో మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగిపోయింది అని మీరు అనుకుంటే పొరపడినట్లే… గతం కంటే ఎర్రచందనం స్మగ్లింగ్ రెండింతలకు పైగా పెరిగింది. బిచ్చలవిడిగా శేషాచలం లోకి వెళ్తున్న ఎర్రచందనం దొంగలు చాలా అధికారికంగానే దానిని అధికార పార్టీ అండదండలతో అమ్ముకుంటున్నారు….


గతంలో శేషాచలం అడవుల్లో చిరుత పులి కనిపిస్తే అదో పెద్ద గొప్పగా భావించేవారు. చిరుతల సంచారం ఇంకా శేషాచలంలో ఉంది అన్న జాడను అటవీ అధికారులు తెలుసుకొని, పై అధికారులకు చెప్పేవారు. చిరుత పులి అడుగు జాడలు అలాగే వాటి సంచారం తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కొందరు సిబ్బంది పని చేసేవారు. కానీ ఇప్పుడు చిరుతపులలో ఏకంగా తిరుమల వస్తున్న భక్తుల మీదే దాడి చేసే స్థాయికి వెళ్లిపోయాయి. దీంతోపాటు వన్యప్రాణి మృగాలు సైతం తిరుమల భక్తుల మీద శేషాచలం అటవీ మార్గంలో దాడి చేసే పరిస్థితులు వస్తున్నాయి. దీనికి ఎర్రచందనం స్మగ్లింగ్ కు చాలా దగ్గర సంబంధం ఉంది. అటవీ జంతువులు అనేవి మానవుల జనావాసాల్లోకి ఊరికే రావు. వాటి నివాస ఆవాసాలను మనుషులు ఆక్రమించినప్పుడు అవి విధి లేక మనుషుల అవసాల్లోకి వస్తాయి. ఇప్పుడు తిరుమలలో రోజుకో చిరుత పులి అలాగే ఎలుగుబంట్లు ఇతర వన్యప్రాణి మృగాలు కనిపించడానికి శేషచలం అడవుల్లో జోరుగా జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రధాన కారణం. అడ్డు అదుపు లేకుండా ఎర్రచందనం స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో సంచరిస్తుండడంతో వాళ్లకు భయపడి వన్యప్రాణులు ఇతర జంతువులు మనుషులు ఉండే ప్రాంతాలకు వస్తున్నాయి. మనుషులు ఏమైనా చేస్తారేమో అన్న భయంతో ముందుగానే వాళ్ల మీద దాడి చేస్తున్నాయి. ఇదంతా స్మగ్లింగ్ తో లింక్ అప్ అయిన వ్యవహారం. అసలు చిరుతలు మానవ నివాసాల్లోకి రావడానికి గల కారణం ఏమిటి అనేది ప్రభుత్వం అన్వేషిస్తే దీనికి మూలాలు తెలుస్తాయి. అటవీ అధికారులతో సమీక్ష చేస్తే అసలు ఎందుకు చిరుతపులులు పదేపదే తిరుమల కనుమల్లో లో కనిపిస్తున్నాయి అనేది అర్థమవుతుంది. దీనిపై కనీసం ప్రభుత్వంగానే తిరుమల తిరుపతి దేవస్థానం గానీ దృష్టి సారించలేదు. చిరుతపులు వస్తున్నాయి అంటే కర్రలు ఇస్తాం రాళ్లు ఇస్తాం అని చెప్పడం చట్ట విరుద్ధం. అడవిలో మార్గం వేసి జంతువుల నివాస స్థలాల నుంచి దేవస్థానానికి దారి మీద వెళ్తున్న భక్తులు వాటి ఆవాసాల్లోకి వెళ్లి వాటిని కొట్టడం అనేది జంతు సంరక్షణ చట్టం ప్రకారం నేరం. మరి తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి నేరాలను ప్రోత్సహిస్తారా..? భక్తులకు చేతి కర్రలు ఇచ్చి అటవీ చట్టాల ఉల్లంఘన స్వయంగా చేపిస్తారా అనేది తెలియడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *