fbpx

పొత్తులపై మళ్ళీ మొదటికి..

Share the content

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేరానివ్వం కచ్చితంగా పొత్తులు ఉంటాయి అని గతంలో ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైఖరిలో ఆయన మాటల్లో ఇప్పుడు మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పొత్తులుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని ప్రకటించడం పట్ల ఇప్పుడు జనసైనికులు అయోమయానికి గురవడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గతంలో దాదాపు తెలుగుదేశం పార్టీ బిజెపి తో కలిసి వెళ్తామని సంకేతాలు ఇచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన సభలో ఇంకా పొత్తుల మీద నిర్ణయం తీసుకోలేదని చెప్పడం పట్ల అయోమయం నెలకొంది. తెలుగుదేశం పార్టీతో కచ్చితంగా కలిసి వెళ్తారని భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు గందరగోళానికి గురి చేస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీతో వచ్చిన చిన్న చిన్న స్పర్ధలు అలాగే వారికి పంపాల్సిన సంకేతాలు పంపే విధంగానే పవన్ కళ్యాణ్ మాట్లాడారు అన్నది రాజకీయ నిపుణుల మాట.

తెలుగుదేశం పార్టీకి స్వీట్ వార్నింగ్

ముఖ్యమంత్రి పీఠం దక్కాలంటే పొత్తుల్లో ఉన్నా సరే కచ్చితంగా తమకు కేటాయించిన అన్ని సీట్లలో గెలవాలి అన్నది పవన్ కళ్యాణ్ ప్రణాళిక. అయితే జనసేన బలం ఎంత ఎన్ని సీట్లు కోరుతుంది అన్నది కీలకం. ఇక్కడే తెలుగుదేశం పార్టీతో కొన్ని విభేదాలు అలాగే స్పర్ధలు వస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కేవలం 20 లోపు సీట్లు కోరితే లేక తీసుకుంటే అది జనసేన పార్టీ శ్రేణుల్లోనే కాదు ఆ పార్టీకి ఓటు వేయాలని అభిమానుల్లో కూడా పూర్తిస్థాయిలో నిరాశ నింపుతుంది. జనసేన పార్టీ 40కు మించి సీట్లు తీసుకుంటేనే ఆ పార్టీ కచ్చితంగా ప్రజా క్షేత్రములో సమాధానం చెప్పుకోగలదు. అయితే అన్ని సీట్లు జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. ఈ విషయంలోనే జనసేన టిడిపి మధ్య పొరపచ్ఛాలు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా ఉన్నాయని టిడిపి భావిస్తోంది. కచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి లాబిస్తుంది అని లెక్కలు వేసుకుంటున్న టిడిపి పెద్దలు జనసేనకు 40 సీట్లకు పైబడి కేటాయించేందుకు మాత్రం సిద్ధంగా లేకపోవడంతోనే పవన్ కళ్యాణ్ పొత్తు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గతంలోనే వెళ్తే పొత్తుతో వెళ్తాం లేకుంటే సింగిల్ గా వెళ్తాం అని ప్రకటించిన జనసేన అధ్యక్షుడు ఏమాత్రం అటు ఇటు అయినా తెలుగుదేశం పార్టీతో పోత్తును పూర్తిగా పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది.

చంద్రబాబు ఢిల్లీ టుర్ తర్వాత మారిన సీన్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల జరిపిన ఢిల్లీ టూర్ చాలా కీలకమైంది. పూర్తి విషయాలు బయటకు రాలేదు కానీ చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత రాజకీయాలు మారుతున్నట్లే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ పెద్దలు చంద్రబాబును ఏమాత్రం ఖాతరు చేయలేదని తెలుస్తోంది. తమకు అవసరమైన స్థానాలు వారు కోరినట్లు, దానికి పూర్తి సంసిద్ధతతో ఉంటేనే వచ్చి మాట్లాడాలని సూచించినట్లు చంద్రబాబుకు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగిందో కూడా ఆంధ్రప్రదేశ్ మీడియాలో బయటకు రాలేదు. బిజెపి పెద్దలతో చంద్రబాబు ఏం మాట్లాడారు అన్నది కూడా మీడియాలో చూపించలేదు. ఢిల్లీ టూర్ తర్వాత చంద్రబాబు పూర్తిగా మీడియాతో మాట్లాడింది లేదు. చంద్రబాబు గతం కంటే చాలా ఒక రకమైన భావనకు లోనవుతున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత తన స్వరం మార్చారు. దీంతో అసలు ఢిల్లీ టూర్ లో బిజెపి పెద్దలు చంద్రబాబుతో ఏం మాట్లాడారు ఏం హామీ ఇచ్చారు అన్న విషయాలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారినన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *