fbpx

వెల్లంపల్లి సీటు చిరిగినట్లే!

Share the content

అవినీతి ఆరోపణలలో గాని తన మాట తీరుతో గాని కావలసినంత వివాదాన్ని మూట కట్టుకున్న వెల్లంపల్లి శ్రీనివాస్ కు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐ ప్యాక్ నిర్వహించిన సర్వేలో పూర్తిస్థాయిలో వెల్లంపల్లి శ్రీనివాస్ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వెల్లంపల్లి కి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో పార్టీ ఓటమి ఖాయమని ఇప్పటికే ఐ ప్యాక్ ప్రతినిధులు తేల్చి చెప్పేసినట్లు సమాచారం. దీంతో విజయవాడ పశ్చిమ స్థానం నుంచి ఓ ముస్లిం నేతను వచ్చే ఎన్నికల్లో నిలబెట్టాలని అధికార పార్టీ భావిస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గం చాలా అధికం. దీంతోపాటు పాతబస్తీలో వర్తకులు అలాగే వ్యాపారులు ఎక్కువ. బీసీలు కూడా ఈ నియోజకవర్గంలో కీలక భూమిక పోషిస్తారు. వీరందరిలో కూడా వెల్లంపల్లి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు వచ్చాయి. దీంతోపాటు అవినీతి ఆరోపణలు సైతం వెల్లంపల్లిని చుట్టుముట్టాయి.

దుర్గగుడి వ్యవహారంలో

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో వెండి రథం సింహపు బొమ్మలు చోరీకి గురి కావడం దానిమీద బెల్లంపల్లి శ్రీనివాస్ మీద రకరకాల ఆరోపణలు రావడం నియోజకవర్గం లో తీవ్ర స్థాయి ప్రతికూలతకు ప్రధాన కారణంగా సర్వేలు చెబుతున్నాయి. దీంతోపాటు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన ఏ పని లేదని, సొంత పార్టీ కార్యకర్తలను సైతం ఆయన దూరంగా ఉంచుతారు అనే పేరు ఎక్కువగా ఉంది. నియోజకవర్గంలో కీలకమైన ముస్లిం పెద్దలను కలుసుకోవడానికి వారితో ప్రత్యేకంగా సమయం కేటాయించడానికి కూడా వెల్లంపల్లి పెద్దగా ఇష్టపడరని పేరుపడ్డారు. ముస్లిం సమాజంలో ముఖ్యంగా బెల్లంపల్లి మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మరోపక్క వ్యాపారులు వర్తకులు కూడా వైసిపికి దూరం అయిన నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బలమైన ముస్లిం వర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఆర్థికంగానూ సామాజికంగానూ బలమైన వ్యక్తి అయితే అందరినీ కలుపుకొని వెళ్తారని భావిస్తున్నారు. ఇప్పటికే నీ ఈ నియోజకవర్గంలో కీలకమైన ముస్లిం నేతలను గుర్తించే పనిలో ఐప్యాక్ బృందం బిజీగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *