fbpx

అక్కడ కాపులకు శెట్టి బలిజలకు ఫైట్

Share the content

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓ కీలకమైన ఫైట్ జరగబోతుంది. ముఖ్యంగా రెండు పరస్పర విరుద్ధమైన కులాల మధ్య ఈ పోటీగా భావించాలి. గోదావరి జిల్లాలో కాపులకు, శెట్టిబలిజలకు చాలావరకు పడదు. ఈ రెండు సామాజిక వర్గాలు ప్రజలు ఉప్పు నిప్పుల ఉంటారు. వీరిని కలిపేందుకు అనేక ప్రయత్నాలు జరిగిన ఇప్పుడిప్పుడే పాత గొడవలు మర్చిపోయి మళ్ళీ సాధారణ స్థాయికి వస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం లో వచ్చే ఎన్నికల్లో కాపులకు శెట్టిబలిజలకు ప్రధానంగా పెద్ద ఫైట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. రెండు బలమైన వర్గాల మధ్య అలాగే బలమైన వ్యక్తులు, శక్తుల మధ్య ఈ రాజకీయ ఫైట్ జరుగుతుందని అంచనా.

పాగా వేసి మంత్రి కావాలని..

వచ్చే ఎన్నికల్లో అధికారం పక్షం వైసీపీ తరఫున పాలకొల్లు నియోజకవర్గం లో మాజీ జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే నియోజకవర్గం నుంచి మేకా శేషుబాబు కూడా పోటీలో ఉన్నప్పటికీ, ఆర్థికంగానూ, సామాజికంగానూ ముందున్న కౌరు శ్రీనివాస్ కే టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కవురు శ్రీనివాస్ ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరుగుతూ క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొదటి నుంచి పాలకొల్లు నియోజకవర్గం మీద పూర్తి దృష్టి నిలిపిన శ్రీనివాస్ కు వైసీపీ పెద్దల నుంచి కూడా మంచి సహకారం ఉంది. జడ్పీ చైర్మన్గా కొనసాగుతున్న శ్రీనివాసును రాజీనామా చేయించి మరి ఎమ్మెల్సీ చేశారు. ఆయనను మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే మంత్రివర్గ విస్తరణను మూడోసారి చేపట్టేందుకు వైయస్ జగన్ ఇష్టపడకపోవడంతో శ్రీనివాస్ కు అదృష్టం కలిసి రాలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిస్తే సామాజిక సమీకరణాల భాగంగా శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి శ్రీనివాస్ కు కచ్చితంగా మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలు నూటికి నూరు శాతం కనిపిస్తున్నాయి. దీనిపై ఎప్పటికీ వైసీపీ పెద్దలు ఆయనకు స్పష్టంగా సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో పాలకులు నియోజకవర్గం లో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ జెండా ఎగురవేయాలి అన్నది శ్రీనివాస్ వ్యూహం. అయితే అది ఎంతవరకు సాధ్యపడుతుంది.. కీలకమైన కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సిట్టింగ్ స్థానంగా ఉన్న నియోజకవర్గంలో శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి పోటీలో నిలిచే శ్రీనివాస్ ఎంతవరకు ప్రభావం చూపుతారు అన్నది కూడా కీలకం.

నిమ్మలకు పాజిటివ్ టాక్

తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు కు పాలకొల్లు నియోజకవర్గం లో మంచి పేరు ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన రామానాయుడు అన్ని వర్గాలను కలుపుకు వెళ్లడంలో విజయం సాధించారు. వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన నిమ్మల రామానాయుడు వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి ప్రభుత్వం మారితే కచ్చితంగా మంచి పదవిని పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అతి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్న నిర్మల రామానాయుడు కు చంద్రబాబు ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు కి టికెట్ కన్ఫామ్ చేసినట్టే. ఒకవేళ పొత్తులో వెళ్లినా నిమ్మలకి చాన్స్ ఉంటుంది. పాలకొల్లు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున ఆశావహులు ఎవరు కనిపించడం లేదు. గుణ్ణం నాగబాబు జనసేన పార్టీ నుంచి వెళ్లిన తర్వాత పాలకొల్లు నియోజకవర్గం ఇన్చార్జిని కూడా నియమించలేదు. దీంతో నిమ్మలకు ఎటు వెళ్లి ఎటు వచ్చిన కచ్చితంగా టికెట్ దక్కినట్లే. దీంతోపాటు క్షేత్రస్థాయిలో బలమున్న నిమ్మలను ఈసారి కనుక గెలిపిస్తే వరుసగా హ్యాట్రిక్ కొట్టినట్లు కూడా అవుతుంది. ఇద్దరిలో ఎవరు గెలిచినా కాపులు శెట్టిబలిజల యుద్ధం మాట ఉంచితే కచ్చితంగా ఒకరు మంత్రి అవ్వడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *