fbpx

ఇద్దరి మధ్య ముదురుతున్న వైరం

Share the content

వైసీపీలో మొదలైన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. మంత్రి వేణు ఇటు ఎంపీ పిల్లి సుభాష్ మధ్య ఏర్పడిన ఆగాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇది చివరకు పెళ్లి సుభాష్ వేణు కనుక వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే తాను ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని హెచ్చరించే వరకు వెళ్ళింది.

రాజోలు నియోజకవర్గం వేణు శెట్టిబలిజ ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అదే సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో పక్క నియోజకవర్గం నుంచి తీసుకువచ్చి వేణుకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వడమే కాక మంత్రివర్గంలో కొనసాగించడం కూడా పిల్లి సుభాష్ కోపానికి కారణమైంది. ఎలాంటి వర్గ వైరుధ్యాలు లేకపోయినప్పటికీ రాజకీయ వైరుధ్యాల కారణంగా వేణుకు సుభాష్ కు మధ్య దూరం పెరిగింది. అయితే పిల్లి సుభాష్ సీనియర్ నేత కావడంతో ఆయనను చల్లబరచడానికి రాజ్యసభ ఎంపీ ఇచ్చినప్పటికీ నియోజకవర్గంలో మాత్రం మంత్రి చెప్పిందే పూర్తి స్థాయిలో అమలైంది. సొంత పార్టీలో ఉన్నప్పటికీ సొంత కేడర్ను కాపాడుకోలేని వ్యక్తిగా సీనియర్ మంత్రిగా సుభాష్ మిగిలిపోయారు. దీంతో సొంత వర్గం నుంచి సుభాష్ మీద తీవ్ర ఒత్తిడి మొదలైంది. మరోవైపు సుభాష్ కొడుకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ కావాలని నియోజకవర్గంలో పర్యటనలు చేస్తుండడంతో కచ్చితంగా రామచంద్రాపురం నియోజకవర్గం మీద పట్టు ఉండాలి అంటే వచ్చే ఎన్నికల్లో వైసిపి టికెట్ తెచ్చుకోవాలి అని పట్టుదలతో పిల్లి సుభాష్ కనిపిస్తున్నారు. దీనికి వైసీపీ అధిష్టానం కూడా అడ్డుపడుతోంది. సిట్టింగ్ మంత్రిని నియోజకవర్గ మారిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తన రాజకీయ భవితవ్యాన్ని తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దాదాపుగా వచ్చే ఎన్నికల్లో వేణుకు రామచంద్రపురం టికెట్ కేటాయించడం ఖరారు అయింది. దీంతో పిల్లి సుభాష్ వచ్చే ఎన్నికల్లో పార్టీ మారకుండా ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. ఇప్పటికిప్పుడు పార్టీ మారుతారు అన్న ప్రచారం సాగితే అధికార పార్టీ నుంచి లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో కచ్చితంగా వైసీపీ అధిష్టానాన్ని భయపెట్టడానికి ఆయన ఈ రకమైన మాటలు అంటున్నారు అన్నది రాజకీయ వర్గాల మాట. మరోవైపు వేణు కూడా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తేల్చి చెబుతున్నారు. దీంతో సుభాష్ అడుగులు ఎటువైపు వెళుతున్నాయి అన్నది కీలకంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *