fbpx

గెలుపు గుర్రాలు కావలెను

Share the content

కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దింపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఎప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జిలు ఉన్నచోట మరింత బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి ఖచ్చితంగా ఆయన నియోజకవర్గాల్లో విజయం సాధించాలి అని ఆయన బలంగా భావిస్తున్నారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి రాజానగరం నియోజకవర్గానికి ఇన్చార్జిలను మార్చారు. జనసేనకు కంచుకోటగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాల ఇన్చార్జిల మీద జనసైనికులు వీర మహిళల్లో అంత మంచి అభిప్రాయం లేదు. క్యాడర్లో పూర్తిస్థాయి నిరాశ నిస్పృహాలు ఉన్నాయి. అయితే ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి మాత్రం మంచి పట్టు ఉంది. దీంతో ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా అన్ని రకాల బేరేజులు వేసిన పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఇన్చార్జిలను మార్చారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారని భావించిన పవన్ కళ్యాణ్ అంచనాలను తారుమారు చేసి టీ టైం అధినేత తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు పిఠాపురం బాధ్యతలు అప్పగించారు.

రాజానగరం నియోజకవర్గం నుంచి ఇన్చార్జిగా కొనసాగుతున్న మేడా గురుదత్త స్థానంలో బలంగా ప్రజల్లోకి వెళ్తున్న బత్తుల బలరామకృష్ణను నియమించారు. ఇక కొవ్వూరు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుకు అవకాశం దక్కింది. ఈ మార్పులు ద్వారా ఖచ్చితంగా పిఠాపురం రాజానగరం నియోజకవర్గాల్లో కొత్త మార్పు వచ్చావు కోసం స్పష్టంగా కనిపిస్తోంది. పొత్తుల్లో వెళ్లిన ఒంటరిగా వెళ్లిన కచ్చితంగా నెగ్గె నియోజకవర్గాలుగా ఇప్పటికే వీటిని లెక్కలో వేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాల ఇన్చార్జులు మార్పుతో క్యాడర్లోను కొత్త ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు. ఆయన్ని నియోజకవర్గం ఇన్చార్జిల మీద ఇప్పటికే క్యాడర్లో పూర్తి అసంతృప్తి ఉన్నవేళ పవన్ తాజాగా ఇన్చార్జిలను కూడా మారుస్తుండడంతో త్వరలో మరిన్ని నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జలను చూడొచ్చని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *