fbpx

నామినేటెడ్ పదవుల్లో శెట్టిబలిజల వాటా సాధిద్ధాం : ఉదయ్ శ్రీనివాస్

Share the content

చట్ట సభల్లో బీసీల వాణి వినిపిస్తామని కాకినాడ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి వనమాడి, పార్లమెంటు అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం స్థానిక హోటల్లో కాకినాడ సిటీ శెట్టిబలిజ సంఘీయుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.ఈ కార్యక్రమానికి సంఘం అద్యక్షులు చొల్లంగి వీరబాబు అధ్యక్షత వహించారు. కూటమి అభ్యర్థులు తంగెళ్ళ, వనమాడిలు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… కార్పొరేషన్ పదవులు, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు, వైన్ షాపుల నిర్వహణ వంటి పలు అంశాలలో తమ వాటా ను శెట్టిబలిజలు హక్కుగా భావించి డిమాండ్ చేసి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. శెట్టిబలిజ మహిళలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణా రాష్ట్రం తరహాలో పర్యాటక కేంద్రంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ను తీర్చి దిద్ది “నీరా ” ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జనసేన, టీడీపీ, బీజేపీల తరఫున పోటీ చేస్తున్న తమను కాకినాడ ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. కబ్జాలకు, అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ ప్రాంతాన్ని ప్రశాంతతకు నిలయంగా ఉంచాలని శెట్టిబలిజ సంఘం నేతలను విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కాకినాడలో ప్రశాంత వాతావరణం కూటమి విజయం ద్వారానే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా శెట్టిబలిజల ఆర్ధిక, సామజిక స్వావలంబనకు తోడ్పడే అంశాలకు సంబంధించిన వినతి పత్రాన్ని కూటమి అభ్యర్థులకు కాకినాడ శెట్టిబలిజ కమిటీ అద్యక్షుడు చొల్లంగి వీరబాబు అందజేసారు. ఈ కార్యక్రమంలో ప్రెసంగి ఆదినారాయణ, బొలిశెట్టి సత్య, శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్తిబాబు, చప్పిడి వేంకటేశ్వర రావు,పెంకే శ్రీనివాసబాబా, గుత్తుల రమణ, గుత్తుల శ్రీనివాస్, రాయుడు నాగేశ్వర రావు, బీజేపీ నేతలు పాలిక శ్రీనివాస్, దొడ్డి వీరేంద్ర, పాలిక రాజశేఖర్, బిసి సెల్ అధ్యక్షులు ఒమ్మి బాలాజీ, న్యాయవాదులు కట్టా ప్రతాప్, కె. వి. ఎస్.ఎన్. మూర్తి, పెంకే శ్రీదేవి, పాలిక వేణుబాబు, పిల్లి సత్తిబాబు, మోహన్ రావు, మేడిశెట్టిచిన్ని, పాలిక చిరంజీవి, చిట్టప్ప, వడిశల దాలమ్మ, కుడుపూడి వెంకట లక్ష్మి, పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *