fbpx

వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ… ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు ? : ఎంఏ షరీఫ్

Share the content

రానున్న ఎన్నికల్లో మాజీ మంత్రి, పోంగూరు నారాయణ గెలుస్తారని అక్కసుతో.. ఎదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలనే దురుద్దేశంతో ఆయన కార్యాలయాల మిధ వైసిపి ప్రభుత్వం వ్యవస్థలతో దాడులు చేయించిందని మాజీ మండలి చైర్మన్ ఎం ఏ షరీఫ్ విమర్శించారు. శనివారం మంగళగిరిలో టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… .అనిల్ కుమార్ యాదవ్ నెల్లూర్ సిటీ లో ఒడిపోతున్నరని తెలిసి ఆయన్ని ఆ స్థానం నుంచి తప్పించారని పేర్కొన్నారు.ముస్లిం ల మీద వల వేయాలనే ముస్లిం అభ్యర్థిని ప్రకటించారని పేర్కొన్నారు. అనిల్ కుమార్ ను తప్పించిచినప్పుడే వైసిపి తన ఓటమిని అంగీకరించిందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టిడిపి ,జనసేన ప్రజా బలంతో లక్ష ఓట్ల మెజార్టీ తో నారాయణ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నారాయణ ఇంటిపై డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ వారు దాడి చేసి భీభత్సం చేయడం రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు అని పేర్కొన్నారు. ఐదు గంటలు అన్వేషించినా ఎటువంటి మందులు, దనం లభించలేదు అని వెల్లడించారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలను ఇబ్బందలకు గురి చేయటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

విద్యా సంస్థలను,వాణిజ్య సంస్థలులను ప్రభుత్వం పలు ఇబ్బందులకు గురి చేయడం వలనే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కర్ణాటక ,తెలంగాణ కు తరలి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. అమర్ రాజా ను విస్తరించాలి అని అనుకున్న తరుణంలో ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం వలన తెలంగాణ కు వెళ్ళింది అని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా నంబూరు లో జరుగుతున్న తబ్లిక్ జమాత్ ఇస్తమా ధార్మిక సమ్మేళనం కు ఉచిత ట్రైన్ సదుపాయం కల్పిస్తామని రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి హామీ ఇచ్చారు. అది నమ్మిన మైనార్టీ సోదరులుకి… రైల్వే స్టేషన్ కు వచ్చాక రూ.1400 రూపాయలు చెల్లించాలని ప్రకటించడంతో భంగపాటు ఎదురైందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *