fbpx

జగన్మోహన్ రెడ్డి ….నీ బటన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయాయి : చంద్రబాబు

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు 124 సార్లు బటన్ నొక్కాను అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ ఐదేళల్లో మధ్యపాన నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలేదు? .సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదు?గుంటలు పడిన రోడ్డు బాగు కోసం ఎందుకు బటన్ నోక్కలేదు ? నిరుద్యోగ యువత కోసం ఎందుకు డిఎస్సీ బటన్ నోక్కలేదని టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సోమవారం అనకాపల్లి జిల్లా మాడుగుల…ఏలూరు జిల్లా చింతలపూడి లో జరిగిన “రా కదలిరా” సభల్లో ఆయన పాల్గొన్నారు .. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….సిపిఎస్ ను వారం రోజుల్లో రద్దు చేస్తాము అని అన్నారు…ఇప్పటకీ ఎన్ని వారాలు అయ్యింది..చివరకి చివరి వారం వచ్చింది…..తొందరలోనే ఈ జగన్మోహన్ రెడ్డి..పొయ్యే వారం కూడా దగ్గరకు వస్తుంది అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఈ సమస్యలకు బటన్ నొక్కలేదు కానీ….జగన్మోహన్ రెడ్డి మైనింగ్ బటన్ నొక్కాడు….భూగర్భ సంపద అంతా దోచేశారు…మాములు దోపిడీ కాదు….ఇసుక బటన్ నొక్కాడు.. సాయంత్రంకి తాడేపల్లి ప్యాలెస్ కి వందల కోట్ల రూపాయలు దోచుకేల్లే పోయే పరిస్తితి వచ్చింది..మద్యం బటన్ నోక్కారు…అక్రమ ధనార్జన తో సొంత బ్రాండ్లు తెచ్చారు…ఫలితంగా 30 లక్షలు మంది అనారోగ్యం పాలయ్యారు…30,000 మంది చనిపోయారు… ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రికి ఇవేం పట్టడం లేదని మండిపడ్డారు.

రానున్న ఎన్నికల్లో ప్రజలు అంత ఒకేటే బటన్ నొక్కుతారు..ఆ బటన్ తో…..జగన్ దన దమహం దిగిపోతుందని తెలిపారు..పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచే దొంగ ..గజదొంగ జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు బటన్ నొక్కడం వలనే…9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయా లేదా?నువ్వు బటన్ నొక్కడం వలన ఆర్టీసి రెట్లు పెరిగాయా? లేదా? నీ బటన్ పుణ్యమే చెత్త పన్ను వచ్చిందా? లేదా? ..ఆస్తి పన్ను వచ్చిందా?లేదా? …..పెట్రోల్ , డీజిల్ రేట్లు పెరిగాయి…నిత్వవసర వస్తువులు ధరలు పెరిగాయి ..దిక్కుమాలిన ప్రభుత్వం… దిక్కుమాలిన బటన్ నొక్కడం వలన ప్రజల జీవితాల్లో ఎన్నో కష్టాలు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రతి కుటుంబం నష్టోయిందా లేదా ? ఐదేళ్లలో ఈ ప్రభుత్వం ఒక్కో కుటుంబం పైనా ఎనిమిదిన్నర లక్షల అదనపు భారం మోపింది. పెట్రోల్ డీజిల్ కరెంట్ ప్రత్యక్ష…పరోక్ష పన్నుల వలన భారం పడిందని వివరించారు. ఇది ఒత్తిత్తి బటన్. అవునా? కాదా ?అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు.

జగన్ పాలనలో విశాఖ విధ్వంసం

రుషికొండ ను అనకొండ లా మింగేశారు.500 కోట్ల రూపాయలు తో ప్యాలెస్ కట్టారు..అందుకే అడుగుతున్న ఉత్తరాంధ్ర కోసం ఒక పైసా ఖర్చు పెట్టారా? రోడ్లు వేశాడా? అభివృద్ధి జరిగిందా? ప్రాజెక్టులు కట్టడా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. వందల మంది సలహాదారులును నియమించి 750 కోట్లు ఇస్తున్నారు..అందులో సాక్షి జీతగాడు సజ్జల రామకృష్ణ రెడ్డికి 140 కోట్లు ఇచ్చిన మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర లో ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు కానీ….సాక్షి కి ఇచ్చింది..1000 కోట్లు…సలహాదారులు కు ఇచ్చింది…700 కోట్లు…ప్యాలెస్ కు కట్టింది 500 కోట్లు…అన్ని కలిపితే.. 2,220 కోట్ల రూపాయలు…ఆ 2,200 కోట్ల రూపాయలను ఉత్తరాంధ్ర లో ఇరిగేషన్ కు ఖర్చు పెట్టలేదు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు.

విశాఖపట్నం పెట్టుబడుల స్వర్గధామం

ప్రశాంతమైన విశాఖ…నేడు కబ్జాలు కు కేంద్రంగా మారిపోయింది అని ఆందోళన వ్యక్తం చేశారు.ఒక్క విశాఖ లోనే 40,000 కోట్ల రూపాయలు దోచేశారు…అందుకే అడుగుతున్నా ఈ వైసిపి కి బుద్ధి చెప్పాలా?లేదా? అని గతంలో నేను మిలీనియం టవర్స్ కట్టాను.. ఐటి నీ ప్రోత్సహించి….ఎన్నో కంపెనీలు ను తీసుకువచ్చాను..వాటన్నిటినీ జగన్ రెడ్డి తరిమేశాడు అని ధ్వజమెత్తారు. విశాఖ లో లులూ షాపింగ్ మాల్ కు అనుమతి ఇచ్చి ఉంటే…ఇక్కడ వారికి ఉద్యోగాలు వచ్చేవి కాదా అని ప్రశ్నించారు.విశాఖ ఒక టూరిజం కేంద్రంగా అభివృద్ధి అయ్యేది….దాన్ని తరిమేసి రియల ఎస్టేట్ కు అమ్మేసి డబ్బులు దోచుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. విశాఖపట్నం కు రైల్వే జోన్ కు కేంద్ర ప్రభుత్వం కు …రాష్ట్ర ప్రభుత్వం 53 ఎకరాలు భూమి ఇచ్చి ఉంటే కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చేవి…విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటే… ఒక్కమాట కూడా మాట్లాడడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో వాజ్ పేయి హయాంలో ఉక్కు కర్మాగారం ను మూసి వేస్తున్నాము అంటే … విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి…విశాఖ ఉక్కును కాపాడింది టిడిపి అని గుర్తు చేశారు.జగన్ కు ఉత్తరాంధ్ర పై ప్రేమ లేదు…జగన్ కు ఒక బంగారు గని గా విశాఖ తయారు అయ్యింది అని పేర్కొన్నారు.

వైసిపి …విధ్వంసం… బాదుడే బాదుడు…హింస..దోపిడీ రెక్కలను విరీచేద్ధాం

రానున్న ఎన్నికల్లో…వైసిపి గుర్తు మూడు రెక్కల్లో ….విధ్వంసం చేసే వైసిపి రెక్కను చిత్తు ..చిత్తుగా ముక్కలు ముక్కలుగా చేయాలని….బాదుడే …బాదుడు రెక్కను పీకేయాడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉండాలని…హింస, దోపిడీ రెక్కను తుక్కు తుక్కు చేయటానికి రాయలసీమ ప్రజలు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మొండి ఫ్యాన్ ను జగన్ కు ఇచ్చి ఐదేళ్లు పాలనకు రిటర్న్ గిఫ్ట్ గా శాశ్వతంగా ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపే సమయం ఆసన్నమైంది అని పిలుపునిచ్చారు.

రాష్ట్ర భవిష్యత్తు ను నిర్దేశం చేసే ఎన్నికలు
రాష్ట్రంలో రానున్న ఎన్నికలు తెలుగుదేశం… జనసేన అధికారం కోసమే సంబంధించినవి కావు.రాష్ట్ర భవిష్యత్తు కోసం.ఈ ఎన్నికలు ప్రజలు..రాష్ట్రం.కోసమే..రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం అని తెలిపారు. సైకో పాలన అంతం చేస్తే తప్ప…మనకు భవిష్యత్తు లేదు…. సైకో పోతే తప్ప…రాష్ట్రానికి మోక్షం లేదు అని పిలుపిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *