fbpx

భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని హైకోర్ట్ చెప్పిందా ? : పట్టాభిరామ్

Share the content

వైసిపి చేతిలో ఒక తప్పుడు మీడియా ఉందని ఇష్టానుసారంగా అసత్య వార్తలు రాస్తూ ప్రెస్మెట్ లు పెట్టీ బురదజల్లే కార్యక్రమం చేస్తుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోమ్మారెడ్డి పట్టభిరాం ధ్వజమెత్తారు. ఎన్నికై దగ్గరపడుతున్న కొద్దీ వైసిపి నేతలు చంద్రబాబు మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఐఎంజీ భారత కు ఇచ్చిన భూ కేటాయింపులపై …తెలంగాణ హైకోర్ట్…. అసలు అవినీతి జరిగింది అని ఎక్కడ చెప్పలేదని ….ఒక ప్రోజెక్ట్ కు భూ కేటాయింపులు చేసిన తర్వాత మళ్లీ ఆ భూములను వెనక్కి తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వం కు ఉంటుందని మాత్రమే హైకోర్ట్ చెప్పిందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోమ్మారెడ్డి పట్టాభిరాం తెలిపారు. శుక్రవారం మంగళగిరి లోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఐఎంజీ అకాడమీ ఫ్లోరిడా వారి భాగస్వామ్యంతో భారత దేశంలో ఏర్పాటైన ఐఎంజీ ఆకడమిస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో చంద్రబాబు ఒప్పందం చేసుకొని హైదరాబాద్ చుట్ట పక్కన భూములు కేటాయించడం జరిగింది అని తెలిపారు. కేటాయించిన భూముల్లో క్రీడలకు సంబంధించి స్టేడియం లు , ట్రైనింగ్ సెంటర్లు ,మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా రూ. 700 కోట్ల రూపాయలుతో క్యాబినెట్ డెసిషన్ ఆదరంగా ఐఎంజీ భారత కి భూములు కేటాతుంచారని తెలిపారు. ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి భూ కేటాయింపులు వెనుకు పెద్ద కుంభకోణం దాగి ఉందిని అకారణంగా భూములు ఇచ్చేశారు అని రకరకాలుగా బురద చల్లే కార్యక్రమం చేశారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ నాయుకుడు అయిన పాల్వాయి గోవర్దన్ రెడ్డి తో కోర్ట్ లో పిటిషన్లు రాజశేఖర్ రెడ్డి వేయించారు అని తెలిపారు. పిటిషన్లపై…..స్పెషల్ జడ్జి ఫర్ స్పెషల్ పోలిష్ ఎస్టాబ్లిష్మెంట్ ఆండ్ యాంటీ బ్యూరో కేసేస్ కేసు ను డిస్మిస్ చేశారని తెలిపారు. ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం సరియినదని ఎలాంటి కుంబకొనం లేదని తీర్పు ఇచ్చారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఏప్రిల్ 26 , 2006 సంవత్సరంన కోర్ట్ జడ్జి ఎసిబి కోర్టు ఇచ్చిన తీర్పు సరియ్యుందని రాష్ట్ర హైకోర్టు సమర్థించింది అని గుర్తు చేశారు. రెండు కోర్టులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టవల్సిన అవర్శరం లేదని స్పష్టమైన తీర్పును ఇస్తే….ఇవాళ మళ్ళీ ఇష్టానుసారం బురదజల్లే ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించారు. గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పులను తప్పుపట్టగలవా ? తీర్పులో పేర్కొన్న అంశాలు నిజం కాదు అని చెప్పే దైర్యం ఉన్నదా సజ్జల రామకృష్ణ రెడ్డి అని ప్రశ్నించారు .ఎప్పటికైనా భారతదేశంకు ఒలింపిక్స్ గేమ్స్ కి ఆతిథ్యం ఇవ్వాలని చంద్రబాబు ఆకాంక్షించారు అని పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో హైదరాబాద్ లో …ఆఫ్రో ఆసియన్ గేమ్స్ ను చంద్రబాబు ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన మాట వాస్తవం కాదా? ప్రధాని వాజ్పేయు చంద్రబాబు ను అభినందించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలని, రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి కల్పించాలని , అంతర్జాతీయ క్రీడల్లో దేశ ప్రతిష్టను పెంపొందించాలని ఒక విజన్ తో…అనేక షరతులు పెట్టీ ,చంద్రబాబు అనుమతులు ఇచ్చారని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *