fbpx

పెట్టుబడులను ఆకర్షించడంలో జగన్ విఫలం : పట్టాభిరామ్

Share the content

పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరు దావోస్ లో జరిగే “వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్” కు వెళ్లి తమ రాష్ట్రాలకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళడం లేదని టిడిపి నాయకులు పట్టాభి ప్రశ్నించారు. బుధవారం మంగళగిరి లోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల పరిపాలనలో ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రి దావోస్ సమావేశం కు హాజరయ్యారు అని విమర్శించారు. వైసిపి ప్రభుత్వ ఉద్దేశం మొత్తం ఎక్కడ ఎంత దోచుకుందాం,ప్రజలపై భారాలు ఏ విధంగా మోపుదాం.. తప్పితే రాష్ట్రానికి పనికి వచ్చే మంచి పని ఏమి చేశారని ప్రశ్నించారు. జగన్ అసమర్థత వలన నిరుద్యోగం లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని మండిపడ్డారు.

2019 నుంచి జూన్ 2023 వరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం నాలుగు సంవత్సరాల లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ .6,679 కోట్లు మాత్రమేనని వెల్లడించారు. దేశంలోనే పెట్టుబడులును ఆకర్షించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ను అట్టడుగు భాగాన నిలిపారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2022 లో ముఖ్యమంత్రి దావోస్ పర్యటన వలన ఒక్క రూపాయి వచ్చినట్లు మా దగ్గర సమాధానం లేదని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ సమాధానం ఇచ్చింది అని వెల్లడించారు. జగన్ తన పరిపాలనలో ఒక సంవత్సరం 2022లో ప్రత్యేక విమానం లో దావోస్ కు అని వెళ్లి లండన్ వెళ్లారన్నారు.అనేక పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం వలన ఏ రకంగా పెట్టుబడులు పెడుతారు అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా విమర్సించారని గుర్తు చేశారు.

పెట్టుబడులను ఆకర్షించడం మానేసి ఉన్నటువంటి వాటిని రద్దు చేశారని విమర్శించారు.తుగ్లక్ పనుల వలన ఉన్నటువంటి రద్దు చేస్తున్నారు. విశాఖపట్నం కు రావలసిన లూలు మాల్ ను హైదరాబాద్ కు ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో ఏర్పాటు కావాల్సిన ఏషియన్ పేపర్ అండ్ పుల్ పరిశ్రమ ఎందుకు వెనక్కి వెళ్లిందని ప్రశ్నించారు. జాకీ పరిశ్రమ కూడా రాష్ట్రాన్ని వదిలి వెళ్లిందని పేర్కొన్నారు. పెట్టుబడులు తీసుకురావటం మానేసి ఉన్నటువంటి పరిశ్రమలను తరిమేసి ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్టను దిగజార్చరని విమర్శించారు. 2022 లో విజయవాడ నుంచి ధావొస్ వెళ్లి ఆయన బినామీ కంపెనీలు అయిన అరబిందో కంనితో ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. అంత దూరం వెళ్లి అధాని,అరబిందో,గ్రీన్ కో ఒప్పందం చేసుకోవటం ఏమిటని ప్రశ్నించారు.

  • టిడిపి ప్రభుత్వంలో రూ.65,327 కోట్ల విదేశీ పెట్టుబడులు
  • 2014-2019 మధ్య టిడిపి హయాంలో జరిగిన ప్రతి సమ్మిట్ కు చంద్రబాబు వెళ్లారని పేర్కొన్నారు. ఫ్యూచర్ అర్బన్ డేవలపమెంట్ అంశంపై చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానితుడు గా వెళ్లారని వెల్లడించారు. 2016 లో జనవరి 20-26 మధ్య “మాస్టరింగ్ ఫోర్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్” అనే అంశంపై చంద్రబాబు మాట్లాడారు అని పేర్కొన్నారు.జెట్రో,ఉబర్,సిమెన్స్,ఫిలిప్స్ అనేక ప్రతినిధులతో మాట్లాడి కంపెనీలను తీసుకువచ్చారని పేర్కొన్నారు. అప్పటి ఫోటోలు వచ్చిన ఎకనమిక్ టైమ్స్ పత్రికను మీడియా సమావేశంలో చూపించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ యొక్క దృష్టిని గత ప్రభుత్వం ఆకర్షించింది అని పేర్కొన్నారు. 2019 లో లోకేష్ డెలి గటిన్ వరల్డ్ ఎకానమీ అనే అంశంపై మాట్లాడారని పేర్కొన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకొకుండా అనేక కంపెనీలు తో మాట్లాడి పెట్టుబడులు తీసుకువచ్చారని వెల్లడించారు. 2014 _2018 విదేశీ పెట్టబడులకు సమనిందించి కేంద్ర ప్రభుత్వ విడుదల చేసిన లెక్కలు
  • 2014 _2015 లో 8,326 కోట్లు
  • 2015_16 లో 10,315 కోట్లు
  • 2016_17- 14,767 కోట్లు
  • 2017_2018 లో రూ. 8,037
  • 2918-2019 లో 23,832 కోట్లు తీసుకువచామన్నారు.
  • ఐదేళ్లలో మొత్తంగా రూ. 65,327 కోట్ల రూపాయలను విదేశీ పెట్టబుడలును తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు కు దక్కుతుంది అని పేర్కొన్నారు. దేశ మొత్తం విదేశీ పెట్టుబడుల లో రాష్ట్ర వాట 14 శాతంగా ఉన్నదనీ వివరించారు. సౌత్ కొరియా వెళ్లి కియా మోటార్స్ ప్రతినిధులతో మాట్లాడి అనంతపూర్ కు కియా పరిశ్రమను తీసుకువచ్చారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *