fbpx

జగన్ రెడ్డి దోపిడీకి కాదేది అనర్హం …టెక్స్ట్ బుక్స్ లో 120 కోట్లు దోపిడీ : పట్టాభి

Share the content

విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేన మామ కాదు కంస మామ అని టిడిపి నేత పట్టాభి మండిపడ్డారు.ఆదివారం మంగళగిరి లో టీడిపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాల ప్రింటింగ్ టెండర్లలో రూ.120 కోట్ల దోపిడీ జరిగిందిని విమర్శించారు.ప్రపంచ వ్యాప్తంగా పేపర్ ధరలు తగ్గినా…గతం కంటే ఎక్కువకు టెండర్ లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం దోపిడీ జగన్మోహన్ రెడ్డి , మంత్రి బొత్స సత్యనారాయణ,విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్, ధనుంజయ్ రెడ్డి కనుసన్నలో జరిగింది అని వెల్లడించారు.పొరుగు రాష్ట్రాలు టెక్స్ట్ బుక్స్ ముద్రణ విషయంలో కచ్చితమైన విధానాలు పాటిస్తుంటే..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కచ్చితమైన విధానాలకు పాతర వేసింది అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలకు వైసిపి నుంచి పోటీ చేసేందుకు ఎవరు ఆసక్తి చూపించడం లేదని బొత్స సత్యనారాయణ కుటుంబానికి ఐదు సీట్లు ఇచ్చారు…ఆ ఖర్చు భరించడానికి టెక్స్ట్ బుక్స్ టెండర్ ల డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి గెలుద్ధమని నిసుగ్గుగా ఎన్నికల ఖర్చులకు పోగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దానిలో భాగంగానే ఈ నెల రెండు తేదీన టెండర్ విడుదల చేశారని తెలిపారు.

సాధారణంగా టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయడానికి అవసరమైన పేపర్ ను ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రింటర్ సంస్థకు ఇస్తుంది. అటు పిమ్మట వారే ప్రింట్, బైండిన్,డెలివరీ చేయటం ఆ సంస్థ చూస్తుంది.కానీ ఆ పద్ధతిని మార్చేసి పేపర్ మొదలు ప్రతి వస్తువు మీరే కొనాలి అని ఎస్టిమేట్ వాల్యూ నే మార్చేశారు.టెండర్లలో ఒక పేపర్ కు 34.2 పైసలు గా నిర్ణయించారు.2022 లో ఒక పేజీ కి 23 పైసలు గా నిర్ణయించారు…ప్రపంచ వ్యాప్తంగా పేపర్ ధర తగ్గితే ఒక పేపర్ ధర 23 పైసలు నుంచి 34.2 పైసలు కు ఎందుకు పెరిగింది అని ప్రశ్నించారు. 2022 ఏడాది టెండర్ లో ఒక పేజీ కి 23 పైసలు లెక్కన 679 కోట్ల 77 లక్షల పేజీలకు 160 కోట్ల 63 లక్షలు బడ్జెట్ పెట్టారు. ఈ ఏడాది టెండర్ ప్రకారం 779 కోట్ల 58 లక్షల పేజీలకు 253 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. గతంలో 21 పైసలు ప్రకారం లెక్కిస్తే.. 739 కోట్ల 58 లక్షల పేజీలకు 155 కోట్లు మాత్రమే అవుతాయి…కానీ ప్రభుత్వం ఇచ్చిన టెండర్ ప్రకారం టెక్స్ట్ బుక్స్ లోనే 100 కోట్లు మింగేస్తున్నారు అని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి టెండర్ లో జరిగినదానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వమే క్వాలిటీ ఆఫ్ పేపర్ ను కొనుగోలు చేస్తే ఉపయోగం ఉంటుంది.కానీ పేపర్ ను ప్రింటర్ కు అప్పచెప్తే నాసిరకం పేపర్ తో ముద్రిస్తే నష్టపోయేది విద్యార్థులు కదా అని ప్రశ్నించారు.తమిళనాడు పేపర్ కంపెనీ కి చెల్లించాల్సిన 200 కోట్ల రూపాయలు ను ఎందుకు చెల్లించలేదు అని ప్రశ్నించారు. పేపర్ ధరలు తగ్గాయని.. మా బకాయిలు చెల్లిస్తే తక్కువ ధరలకే టెక్స్ట్ బుక్ ముద్రించి ఇస్తామని తమిళనాడు పేపర్ కంపెనీలు చెప్పినా.. అడ్డగోలుగా దిచుకోవటానికి పన్నాగం పన్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టన్ను పేపర్ ధర లక్ష రూపాయలు ఉన్న రోజున 23 పైసలు కు టెండర్ పిలిచారు…నేడు టన్ను పేపర్ 85 వేల కు పడిపోయిన 34 పైసలు కు ధర పెంచారు అని వివరించారు. తక్షణమే టెండర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వమే పేపర్ ను కొనుగోలు చేయాలి..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న పేపర్ ఎం ఎస్ ఎఫ్ సి లను నిలపెట్టాలని కోరారు. పొరుగున ఉన్న తెలంగాణ ,తమిళనాడు రాష్ట్రాలు ఏ పద్ధతి లో పుస్తకాలను ముద్రణ చేస్తున్నారో అదే పద్ధతిలో టెక్స్ట్ బుక్ ముద్రణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *