fbpx

వైసీపీ ప్రభుత్వంలో కార్మికులకు తీవ్ర అన్యాయం : కొండబాబు

Share the content

వైసీపీ ప్రభుత్వంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార దిశగా కార్యాచరణ చేపట్టేందుకు రాష్ట్ర టీ ఎన్ టి యూసి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గొట్టముక్కల రఘురామరాజు టెక్కలి నుంచి కుప్పం వరకు తలపెట్టిన కార్మిక బస్సు చైతన్య యాత్ర కాకినాడకు విచ్చేసిన సందర్భంగా శుక్రవారం మెయిన్ రోడ్డు సూపర్ బజార్ నందు గొట్టుముక్కల రఘురామరాజు కాకినాడ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కార్మిక పతాకావిష్కరణ చేశారు. అనంతరం మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు , నిమ్మకాయల చినరాజప్ప జెండా ఊపి కార్మిక చైతన్య యాత్ర బస్సులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా గొట్టుముక్కల రఘురామరాజు, కొండబాబు మాట్లాడుతూ… కార్మికులకు భరోసా కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ TNTUC విభాగం టెక్కలి నుంచి కుప్పం వరకు కార్మిక బస్సు చైతన్య యాత్ర 6 రోజులుగా 25 నియోజకవర్గాల పరిధిలో తోటి కార్మిక నాయకుల మమేకమై యాత్ర కొనసాగించడం జరుగుతుందని, ఏడవ రోజు కాకినాడ నగరంలో శారదాదేవి గుడి వద్ద మరియు గ్లాస్ హౌస్ సెంటర్ల వద్ద భవన నిర్మాణ కార్మికులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 53 లక్షల కార్మికులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన ధరలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని మండిపడ్డారు.గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం పేదవాడికి ఉచితంగా ఇసుక అందిస్తే, నేడు జగన్ రెడ్డి పేదవాడికి అందించాల్సిన ఇసుకను కూడా వ్యాపారంగా మంచుకొని దోచుకుంటున్నాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంగన్‌వాడీలు, మున్సిపల్‌, ఆశా వర్కర్లు, తమ సమస్యలపై సమ్మెలు నిరసనలు చేపడుతుంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సింది పోయి వారిపై బెదిరింపులతో కేసులు బనాయిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం నిమిత్తం ఆందోళనలు చేస్తున్న వారందరికీ తెలుగుదేశం పార్టీ అండగా నిలవడమే యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో TNTUC కాకినాడ జిల్లా అధ్యక్షు కార్యదర్శిలు గదుల సాయిబాబా, తాతపూడి రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్ బాబు, సబ్బతి పనేశ్వరరావు, నగర కమిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, TNTUC నగర అధ్యక్షులు గుజ్జు బాబు, పసుపులేటి వెంకటేశ్వరరావు, హెచ్ ఎం ఎస్ నాయకులు పెనుపోతు రాము, అంగాడి దుర్గారావు, కర్రీ సుబ్బారావు, ఓలేటి పాండురంగ, శేరు శ్రీనివాస్, బలగం పరుశురామ్, అన్నవరం, చెన్నంశెట్టి గోవిందరాజు, దాసరి శ్రీను, కర్రీ రాజారావు, దాసరి మణి, మల్లి, పులపకూర శ్రీనివాస్, పొంగా బుజ్జి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *