fbpx

టిడిపి తలుపులు తెరిస్తే… వైసిపి ఖాళీ అవ్వడం ఖాయం : జ్యోతుల నవీన్

Share the content

రా కదిలిరా” పేరుతో తునిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం అయిందని కాకినాడ టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు .రా కదలిరా సభకు సుమారు లక్షమంది పైగా వచ్చారని.. హాజరైన ప్రతీ ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గురువారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జ్యోతుల విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రానున్న కాలంలో టీడీపీ – జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రజా ప్రభుత్వం ద్వారా ఎన్నో సంక్షేమ, సురక్ష పాలనను ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు. సభలో ఉమ్మడి జిల్లాలో అపరిష్కతంగా ఉన్న పోలవరం ప్రోజెక్ట్, పుష్కర, మల్లవరం ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన సమస్యల్ని చంద్రబాబు వివరించారన్నారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధినేత చంద్రబాబు టీడీపీ శ్రేణులను కోరారని చెప్పారు.

వైసీపీ నాయకులు గడచిన నాలుగు నెలలలో రాష్ట్రాన్ని అంద:పాతాళంలోకి తోసేసారని.. కొద్దిపాటి సంక్షేమం పేరుతో ప్రజలపై భారాలు వేశారని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వంలో మద్యం, విద్యుత్, నిత్యవసర ధరలు విపరీతంగా పెంచేసారని తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు. రా కదలిరా సభపై మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలపై జ్యోతుల స్పందిస్తూ… లక్షకు పైగా రా కదిలిరా సభకు హాజరయ్యారని కావాలంటే వారి వివరాలను ఆయనకు ఇస్తానని వెల్లడించారు. సంక్రాంతిలోగా టీడీపీ ఖాళీ అవుతుంది అన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ… టిడిపి కనుక తలుపులు తెరిస్తే వైసీపీ వాళ్లు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని..దాంతో ఆ పార్టీయే ఖాళీ అవుతుందంని ఎద్దేవా చేశారు. ప్రజా సాధికార యాత్ర పేరుతో వైసీపీ నేతలు చేపట్టిన యాత్రకు అసలు జనాలే కరువు అయ్యారని విమర్శించారు. అంగన్వాడీ లు భారీ ఎత్తున ఆందోళన చేస్తున్న సమయంలో.. సాధికార యాత్ర అక్కడకి చేరుకుందని ఆ జనాన్నే ప్రచారంగా వాడుకున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, తూము కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *