fbpx

ఎన్డీయేతో పొత్తు తెలుగుదేశంకు మరణశాసనమే : వి.శ్రీనివాసరావు

Share the content

కేంద్ర బిజెపి మిత్ర కూటమి అయిన ఎన్డీయే లో తెలుగుదేశం పార్టీ చేరాలనే ఆలోచనే రావడం ఆ పార్టీకి మరణశాసనం రాసుకున్నట్లే అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శించారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన విధానాల పై సిపిఎం,సీపీఐ సంయుక్త సమవేశం శుక్రవారం విజయవాడ భాలోత్సవ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2019 ఎన్డీయే లో నుంచి ఎందుకు బయటకు వచ్చరో…ఇప్పుడు మరలా ఎందుకు కలుస్తున్నారో.. అర్థరాత్రి అమిత్ షా తో సమావేశం అయ్యి ఏ ఒప్పందానికి వచ్చారో చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ కు ద్రోహం చేసినటువంటి బిజెపి….విశాఖ ఉక్కుకర్మాగారం ను తెగనమ్మినా …ప్రత్యేక హోదాను అవమానపరచిన బిజెపి పల్లకి ఎందుకు మోస్తున్నారు అని ప్రశ్నించారు.

దేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ..హిందువులు ముస్లిములు క్రైస్తవులు మధ్య తగాదాలు పేట్టి విద్వేషాలు రగిల్చి దేశాన్ని బిజెపి విచ్ఛిన్నం చేస్తుందని మండిపడ్డారు. అటువంటి బిజెపితో కలిసి రాష్ట్రాన్ని వల్లకాడు చేయదలుచుకున్నారా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎటువంటి మత ఘర్షణ జరిగిన ..బీజీపీ తెచ్చే చిచ్చుకు టిడిపి ఒక కారణం అవుతుంది అని తెలిపారు.ఆ తప్పిదానికి తెలుగుదేశం భాధ్యత వహించాలి అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తిరస్కరించిన బిజెపికి ఎందుకు పట్టం కట్టాలని అనుకుంటున్నారు. ప్రజా మనోభావాలకు వ్యతిరేకంగా ఎందుకు తెలుగుదేశం పోతుంది అని ప్రశ్నించారు.

మనువాద బాధితుల హక్కులును…….జగన్ తాక్కట్టు

ఆనాడు కేంద్ర నిరంకుశత్వం కు…బిజెపి మతోన్మాదానికి వ్యతిరేఖంగా ఎన్టీఆర్ పోరాడారు.హైదరాబాద్ లో మత సామరస్యాన్ని ఆయన సాధించారు. ఈరోజు అదే పార్టీ మరలా బిజెపితో కలిస్తే వాళ్ళు చరిత్ర హీనులు అవుతారని పేర్కొన్నారు. బిజెపితో జత కట్టిన ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ అయిన బలపడిందా అని ప్రశ్నించారు. ఇలాంటి అవకాశావాదులకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఐదేళ్ల తరువాత జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి గుర్తు వచ్చిందా? మనువాద బాధితులందరు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపితే..వారి హక్కులను బిజెపి దగ్గర తాక్కట్టు పెడుతున్నారా? మీరు మైనార్టీలకు ఉద్ధరిస్తారా అని ప్రశ్నించారు. బిజెపి సమన్ల మీధనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు…. తెలుగు ప్రజలు ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే హక్కు మీకు లేదని తెలిపారు.వైసిపి.. తెలుగుదేశం ఒకరని ఒకరు తిట్టుకుంటారు….మళ్ళీ ఇద్దరు బిజెపి పల్లకి మోస్తున్నారు.. అందుకని రెండు పార్టీలుకు ఓటు అడిగే అర్హత లేదు అని పేర్కొన్నారు.

టిడిపి..వైసిపి..జనసేన కు ఓటు వేసినా …మోదీ కి వేసినట్లే… : రామకృష్ణ

వ్యవస్థ లను అంతా తన గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను బెదిరిస్తు.. బ్లాక్ మెయిల్ చేస్తు… ఎన్డీయే లో ఉండండి…లేకపోతే మీ మీద కేసులు పెడతామని.. జైల్లో పెడతామని పద్దతిలో బిజెపి ముందుకు పోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బిజెపి విధానాలకు భయపడి ప్రాంతీయ పార్టీల నాయకులు ఒకరి తరువాత ఒకరు భయపడి వాళ్ళ పంచన చేరుతున్నారని ఎద్దేవా చేశారు. పిలవకపోయిన పరిగెత్తుతున్నారు. పిలిపించుకొని మరి పరిగెత్తుతున్నారు…ఇలాంటి దుర్గతి రాష్ట్రంలో ఏనాడు కూడా చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు త్యాగంగా నిలబడిన వారు ఉన్నారు. ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్ళను ఉన్నారు. ఎన్టీఆర్ కేంద్ర ప్రభుత్వం తో ఢీ అంటే ఢీ అని ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఏనాడు కూడా లోంగిపోలేదు అని గుర్తు చేశారు.

నేడు తెలుగుజాతికి ప్రతినిధులు అని చెప్పుకొనే రాజకీయ పార్టీలు…కేంద్ర బిజెపి పెద్దలు కనుసైగ చేస్తే చాలు పోతున్నారు…సిగ్గులేకుండా చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. అర్థ రాత్రి పూట చర్చలు చేసుకుంటున్నారు…రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని పేర్కొన్నారు. తెలుగు దేశం,వైసిపి,జనసేన కు ఓటు వేసిన అది బిజెపి కి చెందుతుందని తెలిపారు. బిజెపి నీ వ్యతిరేఖించే ప్రజలు రాష్ట్రంలో ఉన్నారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు..విభజన. సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి.విశాఖ ఉక్కను ప్రవేట్ పరం చేశారు ..అలాంటి వారికి మీరు ఏ విధంగా వత్తాసు పలుకుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ను నిరసిస్తూ ఈ నెల 16 న జరిగే నిరసన కార్యక్రమాలు కు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నామని అని పేర్కొన్నారు.బిజెపి నీ వ్యతిరేకించే లౌకిక పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు ఈ నెల 20 న కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *