fbpx

టిడిపి జనసేన ప్రభుత్వంలో మహిళా సాధికారతకు “కలలకు రెక్కలు” : సుంకర పావని

Share the content

రాబోయే టిడిపి జనసేన ప్రభుత్వంలో మహిళా సాధికారత దిశగా ఇరు పార్టీల అధినేతలు ముందడుగు వేసి “కలలకు రెక్కలు” అనే పేరుతో సరికొత్త పథకం ప్రవేశపెట్టారని మాజీ మేయర్, కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన మహిళలు ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకోవటానికి అర్హులుని వివరించారు.అర్హత కల్గిన మహిళలు దేశంలో ఎక్కడైనా నచ్చిన ప్రొఫెషినల్ కోర్సు చేయవచ్చని పావని తెలియజేసారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మాజీ మేయర్, కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ అభివృధికి అహర్నిశలు పాటుపడి, కష్టకాలంలో పార్టీకి వెనుదన్నుగా ఉన్న మహిళా కార్యకర్తలకు ఆమె శుక్రవారం సన్మానం చేశారు.అనంతరం వృద్ధమహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..కలలకు రెక్కలు పథకం కింద మహిళలు తీసుకొనే బ్యాంకు లోన్లకు తెలుగుదేశం-జనసేన ఉమ్మడి ప్రభుత్వం హామి వహిస్తాయని పేర్కొన్నారు. వడ్డీని కుడా ఉమ్మడి ప్రభుత్వం చెలిస్తుందని హామీ ఇచ్చారు. మహిళలలు ఆర్థికంగా బలపడాలంటే టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వానికే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికలలో టీడీపీ-జనసేన కి మహిళలు మద్దత్తు తెలిపి, రాబోయే ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా కార్యదర్శి,ఎక్స్ ఎంపీటీసీ గుత్తుల సూర్యావతి,జిల్లా కార్యదర్శి బొందల రామ లక్ష్మి, బొందల లోకేశ్వరిని ,చెల్లా పార్వతి, సత్య,మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *