fbpx

ఎరుపు తో వెళ్దామా కాషాయంతో వెళ్దామా?

Share the content

తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు చెబుతున్న ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ వద్దని వారించడం వల్లనే పొత్తు ఇంకా పూర్తిస్థాయిలో రూపాంతరం చెందలేదు అన్న విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు బిజెపితో వెళ్లే కంటే మొహమపక్షాలతో గలడమే మంచిది అని చెబుతుంటే దీనికి పవన్ ససేమీరా అంటున్నారు. కచ్చితంగా బిజెపితో కలిసి ఎన్నికలకు వెళ్లాలని పట్టుబడుతున్నారు. దీంతోనే పొత్తు చర్చలు ఎడతెగకుండా సాగుతున్నాయని సమాచారం. ఇప్పటికే పొత్తు విషయం దాదాపు ఖరారు అయిన వామపక్షాలను కలుపుకొని వెళ్లాలా బిజెపితో కలుపుకొని వెళ్లాలా అన్న సందిగ్ధంలో తెలుగుదేశం పార్టీ జనసేన లో ఉండడంతోనే పొత్తు ఇంకా పూర్తిస్థాయిలో బయటకు రాలేదు అని తెలుస్తోంది.

బీజేపీతో వెళ్తే ముస్లిం ఓట్లు పోతాయని భయం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బిజెపితో వెళ్లడం అంత ఇష్టం లేనట్లుగానే కనిపిస్తోంది. బిజెపి ఇప్పటికే వైసీపీకు అంతర్లీనంగా మద్దతు పలుకుతోందని బిజెపి కేంద్ర పెద్దల సైతం వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ తో సఖ్యతగా వ్యవహరిస్తున్నారని ఈ సమయంలో బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు అన్నది చంద్రబాబు మాట. దీంతోపాటు 175 నియోజకవర్గాల్లో సుమారు 25 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల ప్రాబల్యం బాగా ఎక్కువ. అక్కడ కూడా బిజెపితో వెళితే పొత్తు వల్ల కూటమికి దెబ్బ పడే అవకాశం ఉందని చంద్రబాబు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీతో వెళ్లడం వల్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు పదే పదే చెబుతున్నారు. బిజెపిను పక్కనపెట్టి వామపక్షాలను కలుపుకుంటే కూటమికి బలం పెరుగుతుంది అని వామపక్షాలకు సంబంధించిన కొన్ని ఓట్లు కూడా తమ వైపు మరలి కచ్చితంగా అవి విజయం వైపు ప్రభావితం చేస్తాయని చంద్రబాబు లెక్కలతో సహా పవన్ కళ్యాణ్ కు వివరించారు.

బీజేపీ పెద్దలతో గొడవ వద్దు అనుకుంటున్న పవన్

పార్టీ మనుగడలో ఉండాలంటే కచ్చితంగా అధికార అండదండలు ముఖ్యం అని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. రాష్ట్రంలో అధికారం లేకపోయినా కేంద్ర బిజెపి నాయకులతో సఖ్యతగా ఉంటే అది కచ్చితంగా పార్టీ మనుగడకు పనికి వస్తుంది అని పవన్ నమ్ముతున్నారు. కేంద్ర పెద్దలతోనూ ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు మొదటి నుంచి బిజెపితో పొత్తు కొనసాగిస్తున్న జనసేన పార్టీ ఒక్కసారిగా మాట మార్చి చంద్రబాబు ట్రాక్ లోకి వెళితే కచ్చితంగా అది బిజెపి పెద్దలకు కోపం తెప్పించే విషయమే. వచ్చే ఎన్నికల్లోను బిజెపి కచ్చితంగా గెలుస్తుంది అని పవన్ నమ్మిక. దీంతోనే బిజెపితో ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదని ఆయన భావిస్తున్నారు. కచ్చితంగా టిడిపి జనసేన బిజెపి కలిసి పోటీకి వెళ్తాయని పదే పదే పవన్ నొక్కి వక్కాడిస్తున్నారు. ఈ ప్రధాన కారణం తోనే ఇప్పటికే పొత్తు చర్చలు ఏమాత్రం ముందుకు సాగకుండా అలాగే కొనసాగుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *