fbpx

మేనిఫెస్టో ముంచిందా??

Share the content

తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో ఆ పార్టీకి తీసుకురావాల్సిన బలాన్ని తీసుకు రాకపోగా, ఆ పార్టీకి మరింత గుదిబండగా మారింది. ఇటు మీడియాలోనూ అటు స్థిరంగా ఉండే ఓటర్లలోనూ మేధావుల్లోనూ దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. కేవలం సంక్షేమ పథకాలను ప్రకటించి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలని తెలుగుదేశం పార్టీ చూస్తుందో అర్థం కావడం లేదని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ కంటే ఎక్కువగా వ్యయం అయ్యే సంక్షేమ పథకాలను అందించడం పట్ల వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆదాయ మార్గాలు ఎక్కడ?

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కేవలం సంక్షేమం మీద డబ్బులు పంపకం మీద పెట్టిన దృష్టి రాష్ట్రానికి రావలసిన ఆదాయాన్ని ఎలా సృష్టిస్తారు ఎలా సాధించగలుగుతారు అన్నదానిమీద ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు అన్నది మేధావులు మాట. కచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికంటే ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతామని టిడిపి చెబుతున్నప్పటికీ, వైసీపీ కంటే అద్భుతమైన సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతున్నప్పటికీ ఆ సంక్షేమ పథకాల సొమ్మును ఎలా తీసుకువస్తారు అన్నది కూడా మేనిఫెస్టోలో పొందుపరిస్తే బాగుండేది అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీ విజన్ కూడా అర్థం అయ్యేదని, చంద్రబాబు నాయుడు దార్శనికత అందరికీ తెలిసేదని, పార్టీకి కూడా మంచి బూస్టర్ లభించేది అన్నది స్థిర ఓటర్ల మాట.

ఎందుకు ఇప్పుడు?

ఎన్నికల ముందు వచ్చిన మహానాడు లో కార్యకర్తలకు ఒక రకమైన ఉత్సాహం ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యంశాలు మాత్రమే బయటపెట్టారు అని టిడిపి నేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే ఆలోచనలు అలాగే పూర్తిస్థాయి మేనిఫెస్టోను ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధికారికంగా విడుదల చేస్తుంది అన్నది తెలుగుదేశం పార్టీ నేతల మాట. తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకు వెళుతుంది ప్రజలకు ఎలా సంక్షేమం అభివృద్ధి అందిస్తుంది అన్నది పూర్తిస్థాయి డాక్యుమెంటరీ సిద్ధంగా ఉందని వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ఒక దాన్ని విడుదల చేస్తామని టిడిపి నేతలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం విడుదల చేసిన మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంత ఉత్సాహాన్ని ఇచ్చిందో తెలియదు గానీ సాధారణ ఓటర్లలో అలాగే స్థిర ఓటర్లలో మాత్రం ఒక గందరగోళానికి బీజం వేసింది అని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *