fbpx

పేదల ద్రోహి జగన్ రెడ్డి : బోండా ఉమా

Share the content

వైసిపి అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్య నిషేధం చేసి ఓట్లు అడుగుతాను అని అన్నారు.విద్యుత్ ఛార్జీలు పెంచము అన్నారు.. ప్రతి జనవరి లో జాబ్ క్యాలెండర్ ఇస్తాము.వారంలో సిపిఎస్ రద్దు చేస్తాము అన్నారు. ఇచ్చిన హామీల జాబిత నేడు ఏమైంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్. రెడ్డినీ టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.సోమవారం మంగళగిరి లోని టిడిపి రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడుతూ…వైసిపి అధికారం లోకి వచ్చాకా చంద్రన్న భీమా రద్దు చేశారు. అన్నా క్యాంటీన్ రద్దు చేశారు.టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 135 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ద్రోహి జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు.ప్రజలు కడుపు మంటతో ఫ్యాన్ రెక్కలు విరిచెందుకు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. మద్యం, ఇసుక ల ద్వారా వచ్చిన ఆదాయం 2.5 లక్షల కోట్లు అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక చేసిన 12 లక్షల కోట్లు అప్పులు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎది అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి తో సహా ఎవరు చెప్పలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం పాలసీ ద్వారా రెండు లక్షల కోట్లు లాభం పొందారు.ఇసుక మాఫియా ద్వారా యాబై వెల కోట్లు పొందారు. కేవలం రెండు పథకాలతో వచ్చిన ఆదాయం పై ఐదు సంవత్సరాల గా బటన్ నొక్కుతున్నారు జగన్ రెడ్డి. శాండ్..లిక్కర్ ఈ రెండు పథకాల్లో నే ప్రజలు నుంచి వసూలు చేసిన డబ్బులతో 122 సార్లు బటన్ నొక్కారు అని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కు ఒక్క రూపాయి ఇచ్చావా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వాస్తవాల చర్చకు సిద్ధం అంటుంటే తాడేపల్లి లో తలుపులు మూసుకొని కూర్చున్నావు అంటే నువ్వు చెప్పిన ప్రతి మాట అబద్ధం అని తెలిపోయింది.ఇచ్చిన హామీల్లో 85 శాతం హామీలు వైసిపి అమలుచేయలేదని ధ్వజమెత్తారు.సిద్ధం సభ విజయవంతం ఐతే.. వాస్తవాలను వెలికితీసే జర్నలిస్టుల మీద ఎందుకు దాడి చేశారు అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *