fbpx

వైసిపి పుట్టి ముంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ : దేవినేని ఉమా

Share the content

రాష్ట్ర ప్రజలకు వారసత్వంగా వచ్చిన భూముల్ని దోచుకోవాలని… వైసిపి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టమే వైసిపి ప్రభుత్వానికి ఊరితాడు అయ్యింది. చట్టంపై పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఫలితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఎన్నికల్లో వైసిపి పుట్టి ముంచిందని టీడిపి పాలిట్ బ్యూరో సభ్యులు దేవినేని ఉమా తెలిపారు.శుక్రవారం మంగళగిరిలోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐ ప్యాక్ సమావేశంలో వైసిపి గెలుపుపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు… వైసిపి కార్యకర్తలో నాయకుల్లో నమ్మకం కలిగించలేదన్నారు.సి.ఎం మాటలను క్యాడర్ కాడి పడేసింది. ఎన్నికలు తరువాత మంత్రులు, మాజి మంత్రులు మీడియా ముందుకు రావడం లేదు. నలబై మంత్రులు ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. సిఎం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి వస్తారో లేదో అని అనుమానం సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో కనిపిస్తుందని అన్నారు. ఓటమిని ముందుగానే గ్రహించిన సజ్జల భార్గవ్ రెడ్డి తన వైసిపి షోషల్ మీడియాను ఎత్తేసి పక్క రాష్ట్రానికి పారి పోయారని ఎద్దేవా చేశారు. మీ కుమారుడే జెండా ఎత్తేస్తే….ఎవర్ని నమ్మించాలని వైసిపి విజయం పై సజ్జల రామకృష్ణ రెడ్డి ధీమాగా ఉన్నారని ప్రశ్నించారు.

తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటిపై టిడిపి వారే దాడి చేశారని సజ్జల రామకృష్ణ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారనీ విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డినే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి,రఘురామ రెడ్డి, జవహర్ రెడ్డి ల కనుసన్నల్లోనే హింసాత్మక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. డీఎస్పీ చైతన్య రెడ్డి ని సస్పెండ్ చేయకుండా సి.ఎస్. డిజిపి లు ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. అధికారులు చేసిన తప్పులకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *