fbpx

వైసిపి ప్రభుత్వంపై వేటు వేయండి : చంద్రబాబు

Share the content

వైసిపి భస్మాసురుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి.అందుకు మనకు వచ్చిన అవకాశమే ఓటు.మే 13 న జరగనున్న ఎన్నికల్లో… రాష్ట్రాన్ని కాటు వేసిన వైసిపిపై ఓటుతో వేటు వేయాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి, భవిష్యత్ తరాల అభ్యున్నతికి కీలకమైనవి ఈ ఎన్నికలు అని అన్నారు. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా బహిరంగ లేఖ విడుదల చేశారు.కబ్జాలకు,బాదుడుకు,అరాచాలకు ఓటు ద్వారా ముగింపు పలకాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి,ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదాలతో ముందుకు వచ్చిన ఎన్డీయే కూటమిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండేవాళ్ళం

ఒకవైపు విభజన కష్టాలు, మరోవైపు ఆర్ధిక లోటుతో 2014లో టిడిపి ప్రభుత్వం ప్రయాణం మొదలు పెట్టాం. సుపరిపాలనతో అనతికాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాం. ప్రతి వర్గానికి ప్రయోజనం కల్పించేలా వందకు పైగా సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. 2019లో తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండేవాళ్లమని పేర్కొన్నారు. అలాంటి కీలక సమయంలో మోసపూరిత హామీలు, తప్పుడు ప్రచారాలు, డ్రామాలతో ప్రజలను మోసం చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు.

భవిష్యత్ కోసం ఓటు వేయండి

రాబోయే ఐదేళ్లు ఏం చేయాలి.రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న చేయాలన్న విషయంలో కూటమి వద్ధ స్పష్టమైన ప్రణాళిక ఉంది.అందుకే అన్ని వర్గలను కోరుతున్నా.ఆలోచించి ఓటు వేయండి. మరో నలుగురితో ఓటు వేయించండి. నిజాయితీగా నిర్భయంగా ముందుకు వచ్చి రాష్ట్ర భవిష్యత్ కోసం ఓటు వేయాలని కోరారు.ఎన్డీయే కూటమికి చెందిన శాసనసభ, లోక్ సభ అభ్యర్థులను నిండుమనసుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.రానున్న ఎన్నికల్లో వైసిపి భస్మాసురుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *