fbpx

మూడు రోజులు ముచ్చటగా..!

Share the content

క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన మూడు రోజుల సమావేశాలు అనుకున్న ఫలితాలను సాధించాయి. ముఖ్యంగా నేతల మధ్య ఎలాంటి అరామరికలు లేకుండా పూర్తిగా సమన్వయం సాధించడానికి వచ్చే ఎన్నికలను బలంగా ఎదుర్కోవడానికి కచ్చితంగా ఈ సమావేశాలు ఒక అడుగుగా చెప్పవచ్చు. కేవలం పై స్థాయి అగ్రనేతలు మాట్లాడుకొని వదిలేయడం కాకుండా.. జిల్లాస్థాయి నేతలు కూడా ఒకరినొకరు పరిచయం చేసుకొని ఖచ్చితంగా మనమంతా ఒకటి అని సందేశం ఇచ్చేలా ఈ సమావేశాలు అన్ని జిల్లాల్లోనూ సాగాయి. నాయకులు ఒకరికి ఒకరుగా ఐక్యంగా ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ముందుకు సాగడం శుభపరిణామం అని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో అందులోనూ బూత్లో లెవెల్ లో ఉమ్మడిగా లేకపోతే వైసిపి చేసే అరాచకాలకు ఎన్నికల ఫలితాలు కూడా తారుమారు కావచ్చు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వైసిపి నాయకులు ఏం చేయడానికైనా సిద్ధం అయిన పక్షంలో రెండు పార్టీల నాయకులు ఉమ్మడిగా పోరాడితే తప్ప వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపు సాధ్యం కాదు. ఎన్నికలు ముందుగా అప్పటికప్పుడు హడావుడి చేసే కంటే జిల్లాస్థాయిలో నాయకులను ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడడం ద్వారా వారిలో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే తీసుకు రాగలిగారు. కేవలం అధినాయకత్వం మాట్లాడుకోవడమే కాకుండా కిందిస్థాయి కార్యకర్తలకు కూడా పొత్తు ఎంత అవసరం అనేది చెప్పడం ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్లడం సాధ్యం అవుతుందని అధినాయకత్వాలు భావించాయి. దీనిలో భాగంగానే మొదటి విడతగా జిల్లా స్థాయి నేతలను కలపడం తర్వాత ఇంటింటికి కలిసి మేనిఫెస్టోను తీసుకు వెళ్లడం వంటి అంశాలు కచ్చితంగా రెండు పార్టీల మధ్య పొత్తును మరింత బలోపేతం చేస్తాయి అనడంలో సందేహం లేదు.

** చంద్రబాబు మద్యంతర బెయిల్ తర్వాత బయటకు వచ్చిన తరుణంలో ఖచ్చితంగా కొన్ని కీలకమైన రాజకీయ నిర్ణయాలు ఆయన నుంచి మనం ఆశించవచ్చు. ఉమ్మడి మేనిఫెస్టో తయారుచేసి ఇంటింటికి వెళ్తాము అని చెప్పడం ద్వారా మ్యానిఫెస్టో విషయంలోనూ చంద్రబాబు సూచనలు కూడా తీసుకోవచ్చు.

** జనసేన పార్టీ నాయకులు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నాయకులను కలవడం అరుదు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను బలంగా విమర్శించిన వాళ్ళు కూడా ప్రస్తుతం జనసేన పార్టీలో కనిపిస్తారు. అది నాయకులు కాని… కార్యకర్తలు గానీ 2019లో పవన్ కళ్యాణ్ గారి సూచనలు ప్రకారం తెలుగుదేశం పార్టీని విమర్శించినవారే. మళ్లీ వచ్చే ఎన్నికల్లో పొత్తుల భాగంగా కలయిక కోసం కలిసి పని చేయడం అంటే పాత గాయాలను మరిచిపోవడమే. అయితే ఎన్నికల ముందు ఒకేసారి అందర్నీ కలుపుకు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ముందుగానే అందర్నీ కలుపుకుంటూ వెళ్లి ఉమ్మడిగా సమన్వయ సమావేశాలు నిర్వహించడం ద్వారా వారిలో పాత గాయాలు మని కొత్త ఉత్సాహం వస్తుంది అనడంలో సందేహం లేదు. దీంతోపాటు ఎన్నికలకు వారు అన్ని విధాలా పాత విషయాలు మర్చిపోయి ఉమ్మడిగా సంసిద్ధం అవుతారు. ఇది ఈ మూడు రోజులపాటు జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశాల్లో కచ్చితంగా కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *